39.2 C
Hyderabad
April 18, 2024 17: 26 PM
కవి ప్రపంచం

అమ్మంటే అమృతం

#tumma janardhan new

ఆ పిలుపు అమృతధార

ఆ రూపం అపురూపం

ఆ తలంపు అనుభూతివనం

ఆ మనసు మానస సరోవరం

ఆ భావన మధురసం

ఆ ప్రేమ జీవనది

ఆ కారుణ్యం వరం

ఆ ఒడి దేవుని కోవెల

ఆ ఆప్యాయత గిరిశిఖరం

ఆ పాట అమృతవర్షిణి

ఆ సహనము పృధ్వీ తత్వం

ఆ కోపం ఓ అరుణకిరణం

ఆ దండన సంభావన

ఆ గుండె అగాథం

ఆ అండ ప్రకృతిసిద్ధము

ఆ పలుకులు జీవనవెలుగులు

ఆ నడక నైతిక మడుగులు

ఆ సేవలు అంతులేని గాథలు

ఆ గుర్తులు వెన్నెలకాంతులు

ఆ జ్ఞాపకం జీవన సాఫల్యం

ఆ శూన్యత అంధకారం

ఆ మరుపు నరకయాతన

ఆ వర్ణన కవికందని ఊహాస్పందన

ఇదంతా అమ్మ ఆలాపన, ఆరాధన,

ఆస్వాదన, అవలోకన, అద్భుతాల మది శోధన…..

“మాతృ దినోత్సవ” సంబరం అమ్మలందరికీ వందనం

తుమ్మ జనార్దన్ 9440710501

Related posts

విబుధవరులు

Satyam NEWS

జన్మదిన కానుక

Satyam NEWS

ఆ  న‌లుగురు …

Satyam NEWS

Leave a Comment