30.7 C
Hyderabad
April 23, 2024 23: 37 PM
కవి ప్రపంచం

మాతృ దేవత..

#Balu Kattula

కసురుకున్న ఈసురుకున్న

కన్న ప్రేమ కన్న ప్రేమే…

ఎవరి ప్రేమ సాటి రాదు

ఎవరు చల్లగా పంచలేరు

ఎంత ప్రేమిస్తుంది అంటే…

అమ్మ ప్రేమించినంతగా ఎవరు ప్రేమించ లేరు ఈ ఇలకిలో… జగతిలో…

ఆ ప్రేమకు లోతులేదు

ఆ ప్రేమకు అంతు దొరకదు

నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఏమైనా పర్వా నై…

కన్న పేగు అంటే అంతా ఇష్టం.. వేల కట్టలేని ప్రేమ

కన్న బిడ్డ కలతగా ఉంటే తల్లడిల్లిపోతోంది

కడుపులో తల పెట్టుకొని సేద తీరు బిడ్డా అంటూ నేమురు తుంది

ప్రాణం పణంగా పెడుతుంది

తిన తినకున్న కన్నబిడ్డ తింటే చాలు అనుకుంటుంది

రక్షణ కవచం వలే నిరంతరం కంటికి రెప్పల కాపాడు కుంటుంది

ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ ప్రేమకు కంటికి చంటి పిల్లాడే అంటుంది

కన్న బిడ్డలు ఎట్లా ఉన్న

అమ్మ ప్రేమకు రాకుమారుడే…అంటుంది

అదే అమ్మ ప్రేమ.. అవనిలో ఉన్నడగా రుణం తీర్చగలమా…

మరో జన్మకు అమ్మాగా నీకు పుట్టాన్న…

బాలు కత్తుల, లింగ వారి గూడెం, సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి జిల్లా, 9676219655

Related posts

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS

మాతా నీకివే…

Satyam NEWS

తొలి జల్లు పలకరింపు

Satyam NEWS

Leave a Comment