28.7 C
Hyderabad
April 20, 2024 09: 47 AM
కవి ప్రపంచం

కమ్మనైన అమ్మతనం

#Sandhya Sutrave New

అమ్మతనం ఒకరోజు స్మరించుకొనేదికాదు

జీవనదిలా నిరంతరం సాగే ప్రేమప్రవాహం

ప్రేమ ఆరంభమయ్యేది తల్లితో నే

అంతమయ్యేది తల్లితోనే

ఈ సృష్టిలో ఉదాత్తమైనది

తల్లి మనసుమాత్రమే

తల్లి పిల్లలచేయి పట్టుకొని

నడిపించేదికొంతకాలమే

ఆమె హృదయం మాత్రం కొట్టుకొనేది

తన ఆఖరి శ్వాసవరకు,

అమ్మతనం అతిమధురం,

వర్ణించడం ఏ భాషతరంకాదు

అమ్మస్థానాన్ని భర్తిచేయటం

ఎవరితరం కాదు

దేవుడికి మారురూపం అమ్మ

ప్రపంచం దృష్టిలో తాను అమ్మ

పిల్లలకు మాత్రం ఆమెయే ప్రపంచం

తల్లిప్రేమ ఏఅడ్డంకిని అంగీకరించదు

ఎలాంటి సవాళ్ళనైన ఎదరొడ్డుతుంది

ఏ త్యాగానికైన సిద్ధపడుతుంది

తల్లిలేని ఇల్లు దేవతలేని గుడివంటిది

కొవ్వొత్తిలా తాను నిత్యం కాలుతూ

తన పిల్లల ఉజ్వల భవితకు

నిర్విరామ కృషి చేస్తుంది

నువ్వుఎంత ద్వేషించిన నిను ప్రేమించే

వారున్నరంటే అది అమ్మమాత్రమే

అమ్మ తరాల వారసత్వాన్ని

పిల్లలకు అందించే అనుసంధానకర్త

అమ్మ కని, గోరుముద్దలతో

పెద్దచేసి ఓనమాలు దిద్దించి

తన శాయశక్తులా తీర్చిదిద్దుతూ,

పిల్లల శక్తియుక్తులను కనిపెట్టి

సరిదిద్దే తొలి గురువు

అహరహం తన పిల్లల ఉన్నతికి

తన ఆరోగ్యాన్ని సైతం పణంగా

పెట్టే త్యాగమయి

ఈ అమ్మతనం చక్రం

సజావుగా తిరిగినంత కాలం

జగతికి ఆనందం

అది ఆగిందా అంతం

సంధ్య సుత్రావె, సుల్తాన్షాహి,పాతనగరం, హైద్రాబాద్

Related posts

నువ్వంతే…….

Satyam NEWS

అపర చాణక్యుడు

Satyam NEWS

కాలాతీతుడు

Satyam NEWS

Leave a Comment