30.7 C
Hyderabad
April 23, 2024 23: 07 PM
కవి ప్రపంచం

వెలుగు

#Dr.Sammeta Vijaya

రాసే ప్రతి కలం అమ్మను తమ అక్షరాలతో తడిమి చూపించాలనే

పాడే ప్రతి గాయకుడు అమ్మకు తొలిగీతం వినిపించాలనే

ఆడే ప్రతి బొమ్మ అమ్మబొమ్మగా మారాలనే

నర్తించే నాట్యకత్తె అమ్మను తన నటనలో రంగరించాలనే

పుట్టిన పసికందునోట పలికేతొలిపలుకు అమ్మవ్వాలని

పెరిగే ప్రతిబిడ్డకు అమ్మ అండ అవుతుందని

అవనిలో సహనమంటే అమ్మని

విశ్వమంత ప్రేమ  అమ్మది మాత్రమేనని

అమ్మ ఆదిగురవని అమ్మ ఇంటి దీపమని

అమ్మకొంగు బంగారమని

అమ్మే సర్వస్వమని

అమ్మను పూజించమని

అమ్మ మాటవినమని

అమ్మగురించి ఎంతని చెప్పగలవ్

అమ్మను తలవకుండా అసలుండగలవా

ఎందుకంటే..

అమ్మ నీ ఊపిరి

అమ్మ నీ ఉఛ్వాస

అమ్మ నీ ఆశ

అమ్మ నీ బలం

అమ్మ నీ బలహీనత

అమ్మ నీ అస్థిత్వం

అమ్మ నీ ఆత్మవిశ్వాసం

అమ్మ కమ్మని కావ్యం

అమ్మ అందమైన చిత్రం

అమ్మ అద్భుత భావన

అమ్మ ఆనందహేల

అమ్మ అప్సరస

అమ్మ జగతికి అండ

అమ్మ ప్రేమించే లాలన

అమ్మంటే ఓదార్పు

అమ్మ ఒక దీవెన

ఇంకేం చెప్పను

అమ్మ అమ్మే

అమ్మే నీ అసలు వెలుగు

అది నీలో నిండుగ నింపుకో

అమ్మ ఎన్నటికీ  నీతోడు..

డా. సమ్మెట విజయ

Related posts

ఎలా స్వాగతించాలి…?

Satyam NEWS

సోల్జ‌ర్‌కు శాల్యూట్…

Satyam NEWS

గురుదేవులారా…….

Satyam NEWS

Leave a Comment