36.2 C
Hyderabad
April 25, 2024 21: 49 PM
కవి ప్రపంచం

అమ్మంటే…

#Vasarachetla Jayanthi

అమృత తుల్యమైన ఆదిస్వరం అమ్మ

హృదయపులోతుల్లోనుండి

పలికే ఓంకారనాదం

వెన్ను విరిగే పురిటినొప్పులను

పంటికింద అదిమిపెట్టి

మరోజీవికి ప్రాణం పోస్తుంది అమ్మ

మనం ప్రపంచంలోకి వచ్చింది మొదలు

మనమే తానై మన శ్వాసే తన ప్రాణమై

బతుకుతుంది

తన పొత్తిళ్ళను తల్పంగా చేసి

అనురాగాన్ని పంచుతుంది

గారాలచిన్నారి మారాం చేసినప్పుడు

బుజ్జగించి తన నవ్వునూ  ఏడుపు నూ

సమన్వయం చేస్తుంది

జోలపాటతో గానకోకిల అవుతుంది

నడతలో తప్పటడుగులు పడకుండా

అనునిత్యం కాచుకుని ఉంటుంది

తనుఅక్కడే ఉన్నా తన బిడ్డను

ఉన్నతంగా నిలబెడుతుంది

తర్జుమా చేయలేని ప్రేమను పంచుతుంది

తను కట్టై కాలేంతవరకూ

నింగీనేలకుమధ్య నిలువెత్తు

అమృత భాండమై

మనకు అండగా ఉంటుంది

జయంతి వాసరచెట్ల, హైదరాబాద్, 9985525355

Related posts

ఎదురీతలోనే ఆమె!

Satyam NEWS

వర్ణరంజితం పల్లె దారి

Satyam NEWS

కార్మిక కర్షక హ్యాపీ డే…

Satyam NEWS

Leave a Comment