36.2 C
Hyderabad
April 18, 2024 13: 52 PM
Slider కవి ప్రపంచం

అమ్మ కొంగు

#Narayanadasu Manjula Chari

అమ్మా! నీ  పైట కొంగు  చుట్టే నా జ్ఞాపకాలు ముసురుకొని తిరుగాడుతున్నాయి

అమ్మా!నీవు తినిపించిన పాలబువ్వ కమ్మదనం ఇంకా నా నోట్లో పారాడుతూనె ఉంది               

నీవు కైకిలికి పోయి తిరిగి వచ్చిన నిన్ను చుట్టేసుకుంటే

నా బుగ్గలపై అంటిన మట్టి మరకల గురుతులు ఇంకా చెరిగిపోనే లేదు                                      

రూపాయి రూపాయి పోగు చేసి నా కాళ్లకు పట్టీలు తెచ్చి పెడితే

ఆ గజ్జెలు ఇంకా నీ జ్ఞాపకమై మోగుతూనే ఉన్నాయి              

పట్టు పరికిణి కుట్టించి పండుగ నాడు

నన్ను చూసి మురిసిన అమ్మ నిజంగా నిండు బోనం కుండ                                        

మా అమ్మ నిజంగా మా ఇంటి ఎనుగర్ర                              

మా కోసం బ్రతుకు పోరు చేసే అమ్మ  బతుకు బండి చక్రాల కింద పడి

నన్ను నా చెల్లిని బతుకు పోరు బాటలో వదిలి పెట్టి పోయింది                           

అమ్మ చితిలో కాలిపోతుంటే నా కన్నీళ్లను తుడిచిన నాన్న చేయి,

అమ్మ వస్తుంది !అని చెపితే నాకు ఊహ తెలిసే వరకు

అమ్మ కోసం నా కన్నులు గుమ్మంకేలే  ఉండిపోయాయి     

నా చెల్లిని ఒడిలో పెట్టుకొని  ఎదురు చూస్తూ…..      

నారాయణదాసు మంజుల చారి, తెలుగు సంస్కృత అధ్యాపకురాలు, నాగర్ కర్నూల్, చరవాణి:6281570335

Related posts

సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

Satyam NEWS

ఎన్టీఆర్ పేరు తొలగింపు తెలుగు జాతికే అవమానం

Satyam NEWS

ఎడ్యుగ్రామ్ @ టెలిగ్రామ్ ద్వారా ఐఐటీ, నీట్ ప్రిపరేషన్

Satyam NEWS

1 comment

Peddoju May 9, 2021 at 8:22 AM

అమ్మ కొంగు చక్కని బావాలని వడ కట్టి అమ్మ రూపాన్ని తన మనసులో పోత పోసుకున్న రస బావ చిత్రికరణ అద్భుతః ??

Reply

Leave a Comment