39.2 C
Hyderabad
March 29, 2024 14: 19 PM
Slider కవి ప్రపంచం

లోపలి మనిషి!

#Nutenkey Ravindra

పుట్టగానే పరిమళించడం

పువ్వుకు సహజగుణమే!

అయితే

పరిమళిస్తూనే పుట్టిన

అరుదైన పువ్వు అతడు

తెలుగుదనానికి

వెన్నెల వన్నె లద్దిన కలువల ఱేడు

తెలుగు దర్పణానికి

నిలువెత్తు పూతైన మెరుపు తోడు

పంచె కట్టే ఆ పల్లె పెద్దాయన

సూటూ బూటూ ధరిస్తే

ఆ తెల్లోనికే నాయన

పల్లె నుండి ఢిల్లీ దాకా

నడిచిన తోవల నిండా

తంగెడు పూల సోయగాలను

వెదజల్లిన పాలపిట్ట అతడు

వేయి పడగల సాహితీ వెలుగుల్ని

హిందీ గడపల్లో తోరణాలుగ కట్టిన

పాములపర్తి యశోతిలకు డతడు

రాజధర్మ మెరిగిన కర్మయోగి

ధర్మ మర్మ మెరిగిన  మౌనధుని

అందుకనేనేమో

అందలాలే చేతులు సాచి

అధికార పీఠాలే స్వాగతించి

ఎర్రతివాచీలు పరిచా యతనికి

రాష్ట్ర కేంద్ర మంత్రి పదవులైనా

ముఖ్యమంత్రీ ప్రధానమంత్రి వంటి

అత్యున్నత శిఖరాలైనా

బంగారానికి తావి అబ్బినట్టు

అతని స్పర్శ సోకి వన్నెలీనినవి

వాసికెక్కినవే గాని

ఏ దుర్గంధాలనీ అటించుకోని గంధం చెట్టు

సనాతన వంశాంకురమే అయినా

వటవృక్షంలా విస్తరించిన నిత్యనూత్న కుశాగ్రబుద్ధి

సాంప్రదాయిక భూస్వామ్య వారసత్వమైతేనేం

ప్రజాస్వామిక సామ్యవాద సమ్యక్ దృష్టి

ఒక తల్లి దత్తపుత్రుడైనందుకేమో

దేశమాతనే దత్తత తీసుకున్న ముద్దు బిడ్డ

సంస్కరణలకు సంస్కారాన్ని నేర్పి

ప్రగతి రథాన్ని మానవీయ రాచవీధుల గుండా పరుగులెత్తించిన మహారథి

అతడు ఎవరి మీదా ఏ పాదం మోపలేదు

కానీ

రాజకీయ బలిపాదాన్ని నెత్తిన మోసిన

వెంకట నరసింహ నామ వామన స్వరూపమతడు

కుల మత స్థల కాలాలకు అతీతుడైన

భారత జాతీయ రత్నమై వెలిగే ధ్రువతార అతడు!

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295

Related posts

జై గౌడ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతా

Satyam NEWS

త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి

Bhavani

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళం

Satyam NEWS

Leave a Comment