32.2 C
Hyderabad
March 28, 2024 23: 38 PM
Slider కవి ప్రపంచం

సర్వశుభధాత్రి సంక్రాంతి

#Sailaja Mitra

అరుణోదయం అవనికి ఆణిముత్యం 

తొలి అడుగు భోగ భోగాల ‘భోగి’ గా  

వెనకడుగు కమనీయమైన ‘కనుమ’ గా కదులుతుంటే 

‘సం’ క్రాంతి చేస్తుంది ఇలలో రాణివాసం 

పసుపు, కుంకుమల తోరణాల పూజామందిరం 

ప్రకృతిమాత  చుక్కల రంగవల్లుల మధ్య ఒక స్వప్నసుందరం.

ఏడేడు జన్మలలో పుణ్యలోకాలు ప్రాప్తించే పరిమళ పురాణం 

ఆడబడుచుల, అల్లుళ్ళ అలకలలో సేదదేరే అల్లరితనం..!!

జంగదేవుల,బుడబుక్కల, 

పంబల, గంగిరెద్దుల సందడితో  వరాలతల్లి సంబరం..

రైతన్నలకు ధాన్యరాసులనందించే ఆనంద స్వైర్య విహారం 

రాశి నుండి రాశికి మధ్య ప్రయాణించే సంక్రమణం.

బంతి చామంతుల సొగసుల సోయగం..

ఉరిమధ్య కాలువ గట్టున జలతారు ఓణీలతో 

నును సిగ్గుల బుగ్గలతో…..

జడగంటల వయ్యారాలతో…. 

కన్నెపిల్లల చెమ్మచెక్కలతొ  పల్లెతల్లి  పరవశం..

పాతకు స్వస్తి..నూతనత్వపు ప్రశస్తితొ ప్రతి సంక్రాంతి

జీవితానికి ఒక సంసిద్ధం..

మానవ పరివర్తనే ఇందుకు తార్కాణం.

తరతరాల స్నేహ భావాలతో సంక్రాంతి 

విశ్వ మానవ బంధు సుత్రాక్రుతం..!!

దున్నిన భూమి, తడిసిన పొలం కలగలిపిన 

శ్రమ జీవన బంధు దృశ్యం.. 

కావాలంటే ఎదురు రాదు

వద్దనుకుంటే వదిలి పోదు

అందుకే నిరంతరం ఆహ్వానిద్దాం

సర్వ శుభాదాత్రి  సంక్రాతి సౌరభం…!

 శైలజామిత్ర, హైదరాబాద్

Related posts

థ్యాంక్స్: తొగటి కుల నాయకుడికి టెంపుల్ కమిటీ

Satyam NEWS

సత్తెమ్మ గుడి వద్ద పోటెత్తిన జనం

Satyam NEWS

డెడ్ బాడీ కి చికిత్స చేసిన వైద్యులు

Satyam NEWS

Leave a Comment