36.2 C
Hyderabad
April 25, 2024 22: 02 PM
కవి ప్రపంచం

సంక్రాంతి సంబరాలు

#Venku Sanatani

తొలి వేకువ గుడిగంటలు

తెలి వాకిట చలిమంటలు

అరచేతిన గోరింటలు

అరవిరిసే కలకంఠలు

ముత్యాల ముగ్గులు

ముస్తాబుల రంగులు

హరిదాసుల పాటలు

బసవన్నల ఆటలు

పాలకుండ పొంగులు

పాయసాల విందులు

సందె వేళ సరదాలు

సందు చూసి సరసాలు

సంక్రాంతి సంబరాలు

వెంకు సనాతని, బాపట్ల

Related posts

వ్యధాభరిత జీవనం

Satyam NEWS

మానసవనం

Satyam NEWS

మనసు భాష

Satyam NEWS

Leave a Comment