28.2 C
Hyderabad
January 21, 2022 16: 33 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

#Puli Jamuna New

సంక్రాంతి అంటే కర్షకవీరుల కలలకు ప్రతిరూపం

పాడి పంటలతో పల్లెసీమ పులకరించే తరుణం

ధాన్యరాసులతో అన్నదాతలకు కన్నులపండగ

శ్రవణానందమొందించు హరికీర్తనలతో

చిరుచీకట్లలో హరిదాసుల ఆగమనాలు

బాలసంతు శంఖాన్ని లీలగాపూరిస్తుండగా

ముదితలు వేసిన ముత్యాల ముగ్గుల్లో

సప్తవర్ణాల మధ్య కొలువు దీరిన గొబ్బెమ్మలు

కొత్త అల్లుళ్ళ సరదాలతో కొంటె మరదళ్ళ సరసాలతో

ఇంటింటా నవనవోన్మేష కాంతులు వెదజల్లెడు సంక్రాంతి

దాసరి నర్తన గొబ్బెమ్మ దరువు కోడిపందాల పోరు

గణగణగంటలతో గంగిరెద్దుల వారు

భోగిమంటలు బొమ్మల కొలువులు భోగిపళ్ళు

పసందైన పొంగలి వంటల విందు వినోదాలు

పరవశులను చేయు జానపద కళాప్రదర్శనలతో

ఆటపాటల ఆనందహేల సంక్రాంతి పండగ వేళ

ఐక్యతను పెంపొందించే అనిర్వచనీయ సంబరం

నేడు చావుపుటకలు వ్యాపారమవుతున్న వైనంలో

మంచితనం మరచి మానవత్వాన్ని కోల్పోయి

పెచ్చుపెరిగిన అవినీతి స్వార్థం కల్మషాలతో

ప్రపంచీకరణ పరుగుపందెంలో పోటీ పడుతున్న

సమాజ గమనాన్ని మార్చి నీతినియమాలతో కూడిన

గతకాలపు వైభవాలను తేవమ్మా సంక్రాంతి లక్ష్మీ

మనుషుల్లోని మలినాలను నీ భోగిమంటల్లో

దహించివేయగ

రావమ్మా సంక్రాంతి తేవమ్మా వినూత్న కాంతి

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682

Related posts

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి

Satyam NEWS

అమరావతి పరిరక్షణ కోసం ‘మహా పాదయాత్ర’

Sub Editor

టీఆర్ఎస్ అప్రజాస్వామిక వ్యవహారశైలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!