34.2 C
Hyderabad
April 19, 2024 19: 58 PM
Slider కవి ప్రపంచం

కాంతి!సంక్రాంతి!

#Tadinada Bhaskararao

ప్రకృతి వికృతుల కలయికే మన సంస్కృతి

కట్టు బొట్టు ఆచార వ్యవహారాల శైలే

తెలుగింటి ఆడపడచు పురస్కృతి

తెలుగు జీవితాల ప్రతిబింబమే

ఈ కాంతి!సంక్రాంతి!

తెలుగు వేషభాషలు

తెలుగు వెలుగు జిలుగులు

మురిపాల మోముపై,ముత్యాలు

దొర్లిస్తున్నాయి

ముంగిట్లో రతనాల ముగ్గులై

అలరింపజేస్తున్నాయి…

భోగిమంటలు,భోగిపళ్ళు

బసవన్న విన్యాసాలు,హరిదాసు గానమాధుర్యాలు

పతంగ ఆటలు,పొట్టేళ్ళ చెలగాటలు

కోడిపందాలు,సన్నాయి మేళాలు

సందడిగా కనిపించి,కనువిందు చేస్తూ

కళ్ళముందు కదలాడుతునే ఉన్నాయి…

పిల్లల ఆనందం,పెద్దల అనురాగం

వెలుగురేఖలు విచ్చుకుంటూ

విశేషగౌరవాలను ఇచ్చిపుచ్చుకుంటూ

పట్టరాని సంతోషంతో,నట్టింట

పారాడు తున్నాయి

పరువాలపందిరిలో,పరుగులు

తీస్తున్నాయి

ఈవేళ! సంక్రాంతి శుభవేళ!ఆనందహేల!

తాడినాడ భాస్కర రావు, తణుకు, 9441831544

Related posts

పటిష్ట నిఘా

Murali Krishna

ఇండ్ల స్థలాలు కోసం 19న ధర్నా

Bhavani

ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

Leave a Comment