27.7 C
Hyderabad
April 18, 2024 08: 46 AM
కవి ప్రపంచం

సరదాల సంక్రాంతి

#PattemVasantha

తెలుగు లోగిళ్ళు

కొత్త అల్లుళ్ల సందడి

బావమరదళ్ల సయ్యాటలు

ధాన్య రాసులు ఇల్లు చేరగా

అన్నదాత కళ్ళలో ఆనందం

ముంగిట ముత్యాల ముగ్గులు

కన్నెపిల్లల గొబ్బెమ్మ పాటలు

భోగిమంటల వెలుగులో

నులి వెచ్చని కొత్త సెగలు

గుమగుమలాడే పిండివంటలు

భోగి పళ్ళు , బొమ్మల కొలువులు

బసవన్న ఆటలు, హరిదాసు కీర్తనలు

కోడి పందాలు, గాలిపటాల పల్టీలు

కనుమరోజు పశువులకు పూజలు

వీటి కలబోతనే సరదాల సంక్రాంతి

నేడు వీటికి ఆమడ దూరం

మనసులో భయం భయం 

సామాజిక సంబంధాలు కరువు

మూతికి బట్ట, భౌతిక దూరం

మాటిమాటికి చేతులు శుభ్రం

ఇవి పాటిస్తేనే జీవితం భద్రం

లేదంటే శాశ్వత మాయం

పేర్లు మారుతున్న మహమ్మారిని

ధైర్యంతో ఎదుర్కొని పారదోలుతూ

సరదాల సంక్రాంతికి స్వాగతిద్దాం

పత్తెం వసంత, కరీంనగర్, 7780392055

Related posts

తెలుగు జాతి రత్నం

Satyam NEWS

అక్షర బ్రహ్మకు అక్షరాంజలి

Satyam NEWS

నిండైన మూర్తిమత్వం

Satyam NEWS

Leave a Comment