31.7 C
Hyderabad
April 18, 2024 23: 52 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

#Vedardham Madhusudhana Sharma New

జీవితంలోని చీకట్లను

పారద్రోలే భోగి మంటలతో

ధరణిపై స్వర్గలోకపు హరివిల్లులా

తరుణీ మణుల రంగవల్లికలతో

గంగిరెద్దుల విన్యాసాలతో

హరిదాసుల కీర్తనలతో

చెంచుదొరల పాటలతో

గిరిజన మహిళల నృత్యాలతో

రంగురంగుల పూల గొబ్బెమ్మలతో

భోగ భాగ్యాలనిచ్చే

భోగి లక్ష్మికి స్వాగతం

నువ్వుల పిండి స్నానాలతో

కొత్త వస్త్రాల అలంకరణలతో

లేత మావిళ్ళ తోరణాలతో

నోరూరించే పిండి వంటకాలతో

కొత్త అల్లుళ్ళ అలకలతో

బావా మరదళ్ల సరదాలతో

వినువీధిలో పతంగుల విహారాలతో

గోటీబిల్లలు,చెడుగుడు ఆటలతో

గొర్రెపోటేళ్లు, కోళ్ల పందెములతో

హుషారైన హృదయాలతో

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం.

అన్నదాతల ఇంట

కొత్త ధాన్యపు రాసులతో

సిరి సంపదల భోగ భాగ్యాలతో

సంతోషాన్ని అందించే పశువులకు పసుపు కుంకుమల పూజలతో

బీదసాదలకు దానధర్మాలతో

ముత్తైదువల ఆటపాటలతో

కనువిందు చేసే

కనుమ లక్ష్మికి స్వాగతం.

వేదార్థం మధుసూదన శర్మ, కొల్లాపూర్, 9063887585

Related posts

సూర్యారావు కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

Satyam NEWS

జీవిత రాట్నం

Satyam NEWS

పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment