40.2 C
Hyderabad
April 24, 2024 18: 13 PM
కవి ప్రపంచం

హేమంతహేల

#Sandhya Sutrave New

మనసంత నిండుగ

మూడు రోజుల పండుగ

ముచ్చటైన పండుగ

కన్నులకు ఇంపుగ

హేమంత వేళ

పుష్యమాస ఉత్తరాయణం‌లో

మయూఖుడి మకరరాశి

ప్రవేశంతో వచ్చు పర్వం

ముత్యాల ముగ్గులు

రత్నాల రంగులు

ముంగిట మురియగ

భోగిమంటల  వెచ్చదనంలో

బాలలకు భోగిపళ్లు పోయగ

హాయి గొలుపు భానుడి

కొంగొత్త కాంతి, సంక్రాంతి

సకల జనులకు క్రాంతి

పచ్చని పైరు,పాడిపంటలతో

పశు పూజే మలి

పండుగ  కనుమగ

అలరారించు నిండుగ

నోములు నోతురు కొందురు

ఆహ్వానితులు ముత్తైదువ లందరు

వాయినాల వైనం

ఎంతో వైభవం

ప్రతి ఇంట జోరు

హరిదాసు కీర్తనల హోరు

గంగిరెద్దుల ప్రత్యక్షం

పిల్లల కెంతో ప్రత్యేకం

రంగుల పతంగులు

వినువీధి విహారం

అందరికెంతో ఆహ్లాదం

ప్రతిఇంట పాలపొంగు

ధాన్య సిరికి సూచిక

చెరుకు గడల తియ్యదనం

ప్రేమైక్య జీవనానికి సంకేతిక

కుటుంబ సభ్యుల కలయిక

ధనుర్మాస దండగ

ప్రకృతిలో పండుగ

సంక్రాంతి పండుగ

సంధ్య సుత్రావె, సుల్తాన్ షాహి, హైదరాబాద్

Related posts

కొంగ్రొత్త ఆశల ఉగాది

Satyam NEWS

ప్రియసఖుడు

Satyam NEWS

ప్రేమ పాత్రుడు

Satyam NEWS

Leave a Comment