40.2 C
Hyderabad
April 19, 2024 18: 13 PM
Slider కవి ప్రపంచం

ఆకలే అసలు వైరస్

#Saleema Hyderabad

చంకన బిడ్డ నెత్తిన సంచి

కడుపు నింపుకునేందుకు

అలా సాగుతూనే వుంది

వారి జీవనయానం…

మాయదారి కరోనా

మహమ్మారిలా పట్టి

విలయతాండవం చేస్తుంది

నోటికాడి తిండి లాగేసింది

నిలువ నీడ లేదు

చేసేందుకు పనిలేదు

తినేందుకు మెతుకు లేదు

అయిన వారి జాడ లేదు

కాసింత సాయం కోసం

ఎవరో పట్టే ఓ ముద్ద కోసం

జాలిగా ఎదురు చూసే

జీవం లేని ఆ చూపులు

ఎండకు ఎండుతూ

గమ్యాన్ని వెదుకుతూ

విరామమెరుగని నడకతో

బొబ్బలెక్కిన అరికాళ్ళు

ఆకలికి తాళలేక

ఎన్ని పసి ప్రాణాలు

ఎక్కిళ్ళు పెట్టి పెట్టి

గాల్లో కలిసి పోయాయో

వలస కార్మికులకు

కరోనా కంటే

భయంకరమైన వైరస్

ఆకలి ఇప్పుడు….

ఈ వైరస్కు వ్యాక్సిన్

వైద్యులో శాస్త్రవేత్తలో కాదు

మనల్ని పాలిస్తున్న

పాలకులే కనిపెట్టాలి…

 – సలీమా, హైదరాబాద్

Related posts

ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

Satyam NEWS

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS

అక్రమ భారీ షెడ్డు నిర్మాణం: పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఎ సి పి

Satyam NEWS

Leave a Comment