32.7 C
Hyderabad
March 29, 2024 12: 41 PM
Slider కవి ప్రపంచం

వసంతం అంటే

#Aruna Naradabhatla

మనసులో కురిసే

ఆకుపచ్చని వర్షాన్ని

తీయని అక్షరాల్లోకి వంపడమే…

అప్పుడు

కోయిల కూత

తెలియని కొత్త రాగమైనా

అదొక మాధుర్యం

మొండి చెట్టు

ఎవరి స్పర్శో తాకిన

తమకంలో

ఎర్రని చిగురు పెదాలతో

నవ్వులు రువ్వుతుంది

ఆ వెంట వెళ్ళే మేఘం

అనుకోకుండా వెనుదిరిగి కొన్ని చల్లని చినుకులై మురిపిస్తుంది

ఆ తడిపలకరింతల్లో మట్టి

తన ముడుచుకున్న మొగ్గ ముఖాన్ని

విరిసిన పువ్వులను చేసిన ఆకాశానికి

పరిమళ భాషలో ఉత్తరాలు రాయడం

ఆ భావ పరిష్వంగనలో

చెట్లు మరింత సిగ్గుతో ఊగిపోవడం

వసంత మంటే

ఏడాదికోసారే ప్రత్యేకించి సంతోషించే పండుగ కాదు

ప్రతిక్షణం కొత్తగా విరబూసే ప్రకృతి తన్మయం!!

అరుణ నారదభట్ల

Related posts

కరోనా బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం సత్యాగ్రహ దీక్ష

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

Satyam NEWS

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఎస్ సి కేసు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment