30.7 C
Hyderabad
April 17, 2024 00: 51 AM
Slider కవి ప్రపంచం

జీవితాన్ని మోస్తూ…!

#Dr Bheempally Srikanth

ఈ నడక ఏం చెబుతుందిపుడు…!

మాడిన ఆకలికేకల ఆర్తనాదాలను

మెడలో వేసుకుని సంచరిస్తూ

దాహార్తి తీర్చుకొనేందుకు

రోడ్డు పొడవునా నగ్నాకలితో

పరుగులు తీస్తున్న వలసపక్షులు

నవభారతపు పనిసూర్యుళ్ళు

ఈ దృశ్యం దేనికి సంకేతమిపుడు…!

కూలికోసం కోటితిప్పలు పడుతూ

కన్నీటి రెప్పలమాటున దాగిన

ఉప్పొంగే అనంతమైన దుఃఖాన్ని 

ఊపిరిలోనే అదుముకుంటూ

బతుకును శ్వాసిస్తూ బయలుదేరిన

బతుకుజీవి ఆక్రందనల ఆపసోపాలు

ఈ చిత్రం దేనిని ఆవిష్కరిస్తుందిపుడు…!

ఆకలిగొన్న నవభారతాన్ని

నడివీధిలో నగ్నంగా చూపిస్తూ

మసకబారిన జీవితాలతో

నడి ఎండవేడిమిలో నడక సాగిస్తూ

తడారిపోయిన గొంతుకలతో

సెమటసుక్కల ప్రయాణగీతిక

ఈ గోస ఏం చెబుతుందిపుడు…!

మహమ్మారి కరోనా కాటుకు

పనిలేక సొంతూళ్ళకు పోతూ

దారిపొడవునా మరీచికలే దర్శనమిస్తున్నా

తప్పలేని జీవనగమనంలో తిప్పలెన్నో పడుతూ

సొంతగూళ్ళకు చేరుకున్న అభాగ్యులు

దిక్కుమొక్కూలేని దీన బతుకులు

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు, 9032844017

Related posts

సిబ్బందికి మేలు చేయనిది ఈ ఆర్టీసీ సమ్మె

Satyam NEWS

డ్రైనేజీ రిపేరుతో పగిలిన మంచినీటి పైపు

Bhavani

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment