27.7 C
Hyderabad
April 26, 2024 05: 22 AM
Slider కవి ప్రపంచం

ఆ  న‌లుగురు …

#TirunagariSrinivasNew

ప్ర‌తి క్ష‌ణం నీ చుట్టూనే ఉంటారు
నీఆ  న‌లుగురు … నీడ‌లా ప‌రిభ్ర‌మిస్తారు
ప‌లుమార్ల ప్ర‌య‌త్నాలలోనూ
వాళ్ల‌ను నీవు క‌లుసుకోవ‌డం క‌ష్ట‌మే
స‌హ‌జాతంగా పుట్టి పెరిగే
ఆనంద ఉద్వేగ ఉద్రేకాల్ని నియంత్రించి
క‌ర్తవ్యం వైపు  నిన్ను స‌త‌తం కద‌లిస్తుంటారు
సౌహార్ద్రాల‌ను ప‌లికిస్తుంటారు
యాంత్రిక‌త అంటుకున్న జీవితానికి
అలికిడులు అద్ది చైత‌న్యం పూస్తుంటారు
ముఖ పుస్త‌కాల‌ను తెరిపిస్తుంటారు
అర్థ‌మ‌య్యే ప‌రిభాష‌లో
అదృశ్యంగా మాట్లాడుతుంటారు
హృద‌య‌స్ప‌ర్శ‌తో అన్నీ పంచుకుంటారు
నియంత్ర‌ణ‌ల ప‌రిమితుల్ని చెబుతారు
నాలుగు మాట‌లు మాట్లాడే తీరిక నీకు లేన‌ప్పుడు
న‌వ్వుతూ కాసేపు వ‌దిలేస్తారు
నువ్వలసిపోయినా బ‌డ‌లిక లేకుండా
మెల‌కువ‌తో స‌న్న‌ధ్దంగా నిల‌బ‌డ‌తారు
నిత్య యుద్ధంతో  మూసుకుపోయే
నీ త‌లుపుల‌ను భ‌రోసా ఇస్తూ త‌డుతుంటారు
ఏదేమైనా నీ హితులు వారే
స‌న్నిహితులూ వారే
క‌నిపించ‌క వినినించే క్షేమేంద్రులు వారే
మ‌న‌సు ఇంటిలో ఆ నలుగురు
శాశ్వ‌త కుటుంబ మిత్రులు
పొమ్మ‌న‌కుండా పొగ‌పెట్టే
తెగ‌తెంపుల ప్ర‌పంచంలో
క‌ర్క‌శాలు  విదిలే క‌న్నీటి బాధ‌ల్ని
పంచుకోవ‌డానికి చివ‌ర‌కు మిగిలేది ఆ న‌లుగురే
నీలో క‌నిపించ‌క నివ‌సించే మౌన‌మునులే
నీతో చెలిమికి నీ బ‌లిమికి చేదోడు వారే
నీ మంచి చెడ్డ‌ల్ని అడిగేదీ వారే
నిన్ను అనుక్షణం స‌మీక్షించేదీ వారే
నీ చివ‌రి ఊపిరితోనూ న‌డిచొచ్చేది వారే
లోకానికి నీ సాక్ష్యం ఆ నలుగురే…..
నువ్వెళ్ళాక నీ ముద్ర‌ను మిగిల్చేదీ వారే
నీ ఆత్మ‌గౌర‌వ ప‌రిమ‌ళాలు వారే…..

తిరున‌గరి శ్రీ‌నివాస్ 8466053933

Related posts

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా సభ్యుడి అరెస్టు

Satyam NEWS

ఒక వ్యక్తి మరణించిన ఈ యాక్సిడెంట్ కు కారణం ఎవరు?

Satyam NEWS

నేమ్ చేంజ్:కరోనా వైరస్ కాదు ఇక ఫై కొవిడ్‌-19

Satyam NEWS

Leave a Comment