39.2 C
Hyderabad
March 28, 2024 17: 08 PM
Slider కవి ప్రపంచం

తొణికిన స్వప్నం

#Monsoon in AP

తిండిగింజలిచ్చే చేను

రైతన్న ఉచ్ఛ్వాస, నిశ్వాస

రుతుపవనాల రాకకోసం

నిలువెల్ల కనులై.. నింగికేసి చూపై

క్షణం…క్షణం… నిరీక్షణం

అంతలోనే రైతన్నను మురిపిస్తూ

ఆకాశం ముసురుతో ముస్తాబు

రైతన్న ముఖానికి వెలుగులిస్తూ

ఆకాశాన మెరుపుల మాయాజాలం

చినుకు… చినుకు.. చిరునవ్వుల ధారై

అతడి మది ఆనందాల చిత్తడయింది

ఆశ పెట్టిన వాన

అతడిని ఆడిస్తూ అర్ధాంతరంగా ఆగింది

రైతన్నను వెక్కిరిస్తూ

వారమైనా రాను పొమ్మంది

నాట్ల మాట తలపుకొస్తే

రైతు కంట నీటి పంట

అతడికి తొలకరి

ఓ తొణికిన స్వప్నం

జె.శ్వామల

Related posts

ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం

Satyam NEWS

తెలంగాణలో ఇక ఆర్టీసీ సమ్మె ముగిసింది

Satyam NEWS

రేవంత్ లేటెస్టు నిర్ణయంతో మారుతున్న రాజకీయం

Satyam NEWS

1 comment

Mramalakshmi January 16, 2021 at 5:59 PM

రైతన్న దుస్థితికి నిదర్శనం

Reply

Leave a Comment