31.7 C
Hyderabad
April 25, 2024 02: 28 AM
Slider కవి ప్రపంచం

విధివంచిత

#Nellutla Sunitha New
kaviprapancham-4

విధి వంచించితేనేమి కుంచించని ఆత్మస్థైర్యం ఆమెది

బతుకు జట్కా బండి పై బాధ్యతల బరువును మోస్తూ

సంసార చక్రానికి ఇరుసై అనునిత్యం

అలుపెరుగని పయనం ఆమెది

పేదరికం శాపమై పరిహసించిన

జవసత్వాలను నరనరాల్లో నింపుకొని

కష్టాల కడలిని దాటుతూ ప్రమాద ఘంటికలను ప్రతిఘటిస్తూ

బతుకు పోరాటంలో మెండైన  వీరనారి ధీరత్వం ఆమెది

పిడికెడు మెతుకుల కోసం ముప్పేట ముప్పు తిప్పలు పడుతూ

కార్యశూరురాలయి కర్తవ్య దీక్షతో

కార్మికురాలుగా అనుభవ సారాలు నింపుకొన్న మొక్కవోని ధైర్యం ఆమెది

మనోధైర్యం నింపుకుని మమకారపు ఒడిలో   స్వేదం చిందిస్తూ ప్రేమదారకు మమతలద్ది

బిడ్డను కొంగున కట్టి సృష్టికే రూపశిల్పిగా మారిన  పరిపూర్ణ అమ్మతనం ఆమెది

అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ స్వశక్తితో అడుగులు వేస్తూ బతుకు చదరంగంలో పావులా  కదులుతూ

శ్రామిక సౌందర్యంతో ఎవరెస్ట్ శిఖరమై  వెలిగే దివ్యతేజం ఆమెది

ఇటుకలను మెట్లుమెట్లుగా పేర్చు తూ విశ్వ వేదికపై

ఆశల సౌధాలు  నిర్మించుకుంటున్న

ప్రేరణ ఆమెది

భావితరానికి స్ఫూర్తిగా నిలిచిన బతుకు కాన్వాస్ పై ఆమె చిత్రం

మట్టి పరిమళమై గుబాళిస్తూ

మానవత్వం మరుగైన వారికి మసక చిత్రం  ఆమెది

గోవర్ధన గిరిని చుట్టిన వాసుకిలా కుస్తీ పడుతూ

మనసున్న మనుషులకు కానవచ్చే ఆమె బతుకుచిత్రం

నెల్లుట్ల సునీత, ఖమ్మం, 7989460657

Related posts

హుజుర్ నగర్ మండలాన్ని కరోనా రహితంగా మారుద్దాం

Satyam NEWS

కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ప్రభుత్వం అండ

Satyam NEWS

యంగ్‌ హీరో నాగశౌర్య, సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో `ల‌క్ష్య`

Satyam NEWS

Leave a Comment