31.2 C
Hyderabad
April 19, 2024 04: 23 AM
Slider కవి ప్రపంచం

విశ్వ జనీనం

#loderamulu

సకలజన సమన్వయమే సనాతనం

సర్వజన సామరస్యమే భారతీయం

మహోన్నత హిమగిరిశృంగం హైందవం

వివేకానందుడు పూరించిన శంఖనాదం

భారతీయతకు సనాతన ధర్మానికి అవిభాజ్య అనన్య అనుబంధం

హిందూ విజ్ఞానం  వైశ్వికం

తార్కిక, తాత్విక చింతన గలవారికి

మార్గదర్శి హిందూ మతం

హైందవ ఔనత్యాన్ని కొనియాడిన ప్రపంచం

సహనశీలం, సామరస్యం, సహజీవనం

ఎన్నో సులక్షణాలు కల్గిన మతం హైందవమే నన్నది విశ్వవిదితం

సహజశాంతి, సాత్వికత, సౌభ్రాతృత్వం

ఈధర్మం ఆస్థులన్నది చారిత్రక యధార్థం

స్త్రీవివక్ష,కులవ్యవస్థ అజ్ఞాన కల్పిత దురాచారాలు కనుమరుగైనా

పదేపదే కుంపటి రాజేసే మత

మార్పిడి ముఠాలు

భారతదేశ పరంపరకు హిందుత్వ ధర్మానికి

ఉన్న అభేదాన్ని ఈదేశపు ఆత్మయే హైందవం..అని ఎలుగెత్తిన

అనిబిసెంట్, స్వామి వివేకానంద

రాజకీయ అండదండలతో దేశాన్ని అల్లరిపాలు చేయాలనే ప్రయత్నం

అనాదిగా చేస్తూనే ఉన్నా వారి

తాటాకు చప్పుళ్లకు బెదరం

ఈదేశ హిమగిరి శృంగాలు చెక్కు చెదరనివ్వం

హైందవ హృదయం విశ్వజనీనం

లోడె రాములు, స్వాములవారి లింగోటం, యాదాద్రి భువనగిరి, చరవాణి 7382804913

Related posts

నాగర్ కర్నూలు జిల్లా లో వేసవి శిక్షణ శిబిరాలు

Satyam NEWS

గ్లోబరీనా..ఓ గ్లోబరీనా.. ఓహో గ్లోబరీనా

Satyam NEWS

మానవత్వంతో ఉంటే పదుగురికి సాయ పడండి

Satyam NEWS

Leave a Comment