28.7 C
Hyderabad
April 20, 2024 10: 07 AM
Slider కవి ప్రపంచం

చతుర్వేదసారం

#Sandhya Sutrave New

సప్తసింధు ఏడు నదులప్రాంతం

హిందు పదమూలం ‘సింధు’

హిందు  తొలుత  వాడింది పార్శీలు

పార్శీలో హిందు పద అర్థం

సింధు నదితీరవాసులనీ

అందరికీ ఆచరణీయమైంది “ధర్మం”

మానవ సత్సంకల్పాలు

ఇతరులకు నష్టం కాకుండా

నెర వేర్చుకోవడం ధర్మం

ఇది ఒక గొప్ప సూత్రం

కొందరి అభిప్రాయమైనదే “మతం”

వేదం విద్ ధాతు ఉద్భవం

విద్ అర్థం జ్ఞానం

వేద సంబంధ మతాలు

ఆచరించే వారేహిందువులు

ఇది జగతిలో అతిపెద్ద

మూడవమతం

వేదాంతం,తత్త్వం, పురాణాలు,

ఉపనిషత్తులు,ఆగమాలు,

మహాకావ్యాలు రామాయణం,మహాభారతం,

భగవద్గీత అన్నీ వేదాల సారమే,

ఋగ్వేదం యాగాలలో దేవతాహ్వానం

యజుర్వేదం యాగబలి

దానంలో చెప్పే మంత్రాలు

సామవేదం మృదుమధుర మంత్రాలు

అధర్వణవేదం ఆత్మ ప్రేతాత్మల

సంబంధ మంత్రవిద్య

హిందుత్వం వైవిధ్యభరితం

నీతి, నియమాలు, విధులు, సంసారం,

మోక్షం,యోగం లతో ప్రబలం

మానవుని కర్తవ్యాలు నాల్గు

ధర్మం, అర్థం, కామం, మోక్షం

మోక్షమార్గాలు నాలుగు

జ్ఞాన, కర్మ, భక్తి, క్రియా మార్గాలు

అందరిచే ఆమోదితం భక్తిమార్గం

ఇది బ్రహ్మ అంటే పరమాత్మ

సృష్టి, స్థితి, లయకర్తగా ఆరాధిస్తారు

ఇది రెండు రకాలు

అద్వైతం, ద్వైతం

ఆత్మ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అద్వైతం,

ద్వైతంలో ఆత్మ, పరమాత్మ వేరు

దేవతలు స్వర్గలోకవాసులనీ

మానవాళికి సరైన దిశానిర్దేశం

కొరకే అవతారపురుషులు

వెలుస్తారని వారే రామావతారం,

కృష్ణావతారం అని

పుట్టుక, మరణం, పునర్జన్మల

చక్రమే సం‌సారం అని

హిందూధర్మం గృహస్తు,

సన్యాస ధర్మాలను అంగీకరిస్తుంది

లక్ష్యసాధన మార్గమే యోగం

హిందుత్వంలో వర్ణాలు నాలుగు

బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర

మనుధర్మం స్త్రీల హక్కులను

నొక్కి ఎక్స్ రే

తల్లిదండ్రులు, గురువులు, దైవం,

అతిథి, పరస్త్రీలు

హిందూత్వ  ఆచరణలో

నిత్యదీపారాధన, నైవేద్యం,

వేదపారాయణం, దైవస్తోత్రం,

మంత్ర పఠనం, ధ్యానం, పూజ

వంటివి, కష్టమైనా నిష్టగా

ఇష్టంగా చేయడమే

హిందూత్వ ధర్మం

అదే సనాతన సుధర్మం

సంధ్య సుత్రావె, పాతనరం, హైదరాబాద్, ఫోన్ 9177615967

Related posts

ప్రజల మనిషి సీతక్కను అరెస్టు చేయడం దుర్మార్గం

Satyam NEWS

ప్రలోభాలు, బెదిరింపుల వల్లే కడప జిల్లాలో ఏకగ్రీవాలు

Satyam NEWS

42 ఉప్ణోగ్రతల నడుమ.. ట్రాఫిక్ పోలీసులు విధులు.. నడిరోడ్డుపై ఆక్రమల తొలగింపు…!

Satyam NEWS

Leave a Comment