37.2 C
Hyderabad
March 28, 2024 17: 15 PM
Slider కవి ప్రపంచం

విజ్ఞానఖని

#vedantamshartchandra

విజ్ఞానఖని అయిన వేదభూమి మనది

మహర్షి ప్రోక్తమైన శాస్త్ర సంప్రదాయాలు మనవి

భారతంబు జనించిన భారతావని యిది

రామాయణోద్భవ నీతి మనది

అందుకే

మన విజ్ఞాన శాస్త్రములు చూసి వెన్నులో వణుకు పుట్టి

సిరిసంపదలను చూసి కన్ను కుట్టి

దండయాత్రలు చేసి దోచుకొనెనుకొందరు

ధరణి పతులై దండుకొనెనింకొందరు

దేవస్థలములు కూలదోసను కొందరు

హిందువులను హింసించెను మరికొందరు

మానవత్వం చాటున మత మార్పిడులు చేసెను కొందరు

విజ్ఞానఖని అయిన విద్యా వ్యవస్థను నాశనం చేసెనింకొందరు

ఎవరెన్ని కుట్రలు పన్నినా..

ఎంతగా హైందవ జాతిని భంగపరిచినా..

కింద పడిన కెరటం వలే ఉప్పొంగుతూనే ఉన్నది

తన పైన పడిన ముద్రను చెరిపివేస్తున్నది

ఎందుకంటే

ఇది శ్రీరాముడు ఏలిన పుణ్యభూమి

శ్రీకృష్ణుడు గీతను తెలిపిన కర్మభూమి

భావి కాలానికి ఇదే మార్గదర్శకమైన గురు భూమి

వేదాంతం శరత్ చంద్ర, తెలుగు ఉపాధ్యాయుడు, గద్వాల్

Related posts

విద్యల నగరాన్నిదొంగలు లక్ష్యంగా చేసుకున్నారా..!

Sub Editor

కనుల పండువగా శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవం

Satyam NEWS

ఖాతాదారులపై భారం మోపనున్న ఎస్ బి ఐ

Satyam NEWS

Leave a Comment