40.2 C
Hyderabad
April 19, 2024 15: 58 PM
Slider కవి ప్రపంచం

సంభవామి యుగే యుగే

#glnshastry

ముక్కోటి దేవతలు ఒక్కటై

ధర్మాన్ని ప్రభోధిoచి,

ఆది,మధ్యాంతరములు లేక,

అనంతమయమైన ప్రపంచానికి

దిక్సూచిగా దారిచూపిన ధర్మం.

దౌష్ట్యం పెరిగినప్పుడల్లా

సంభావామి యుగే, యుగే అంటూ,

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి,

భగవద్గీత లోకానికి ప్రవచించిన

శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్వచించి ధర్మం.

అష్టాదశ పురాణములతో,

ధర్మా,అధర్మ,విచక్షణను నేర్పి

లోకానికి మార్గదర్శనం చేసి

ధర్మో, రక్షతి, రక్షితః అంటూ,

మార్గదర్శనం చేసిన ధర్మం.

మహిళను శక్తి స్వరూపమని నమ్మి,

నవవిధ రూపములతో,

అమ్మను దేవతగా నిలిపి

నవరాత్రులు కొలిచి,

స్ర్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన ధర్మం..

తిమిరంతో సమరం చేస్తోంది.

రండి మనమందరం వెలుగు దివ్వెలై,

అంధకారాన్ని తొలగించి

హిందూ ధర్మాన్ని నిలబెట్టి

” సర్వేజనా సుఖినోభవంతు “

సత్యాన్ని నిజం చేద్దాం.

జి .ఎల్ .ఎన్. శాస్త్రి, విశాఖపట్నం 534001, చరవాణి 9492988836

Related posts

నదుల అనుసంధానంపై చంద్రబాబు అసత్యప్రచారం

Satyam NEWS

కచ్చితంగా ఇక నుంచి మాస్కులు ధరించాల్సిందే

Satyam NEWS

యోగ పుట్టిన దేశంలో వ్యాయామం లేక యువత నిర్వీర్యం

Satyam NEWS

Leave a Comment