27.7 C
Hyderabad
March 29, 2024 02: 10 AM
కవి ప్రపంచం

గీతోపదేశం

#m.anasuya

గీతోపదేశం ప్రకారం

కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి

వారి వారి ధర్మాలను కొనసాగిస్తూ

నైతికత విలువలతో కూడిన

సనాతన ధర్మాన్ని ఆచరించడమే హిందూత్వం

సకల చరాచర జీవరాశిలోనూ

పరమాత్మను దర్శిస్తూ

సమస్త విశ్వసంక్షేమమే

తన సంక్షేమమని భావిస్తుంది!

విద్ – జ్ఞానం మూడు రకాలుగా ఉంది

పురాతన దేవాలయాలపై రాయబడిన

శిలా శాసనాలు ప్రధాన ఆధారం

అంతుచిక్కని తాళపత్ర గ్రంధాలు

ఇకపోతే గురుశిష్య పరంపర

గురు శిష్య పరంపరలో భాగంగా….

వేదాలు,ఉపనిషత్తులు,వేదాంగాలు,

ఇతిహాసాలు, పురాణాలు, చందస్సు,

వ్యాకరణం, ఆయుర్వేద గ్రంధాలు

గణితము, ఖగోళము, జ్యోతిష్యము,

సిద్ధాంతాలు అనేకనేకాలు

ఆధారాలతో సహా మనకు

దర్శనమిస్తున్నాయి …..

నేటి శాస్త్రీయ జ్ఞానమంతా

నాటి వేదాల్లో, పురాణాల్లో

ముందే వ్రాయబడిందని

స్వయంగా “నాసా” యే ఒప్పుకుంది

రామాయణంలోని రామసేతు

స్వయంగా మానవ నిర్మితమేనని

పుష్పక విమానానికి ఆధారాలు ఉన్నాయని నేటి పరిశోధన సంస్థలు చెప్పుకొస్తున్నారు.

ఎలా జీవించాలి అనే ప్రశ్నకు సమాధానం

శ్రీరాముని ఆదర్శ జీవన విధానం

ఎలా ఉండకూడదు చెప్పడానికి మహాభారత సంగ్రామం

ఋషులు దర్శించిన సత్యాలు

జీవన విధానం తరతరాలుగా శాశ్వతమైన విలువలు గల వ్యవస్థను అందించింది

మన హిందూతనం నిరంతరం

వృద్ధి చెందే సంప్రదాయం

ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు మూలం

మన సంస్కృత వేదాలే

ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన గ్రంధాలు రామాయణం,మహాభారతాలు.

భారతీయ సమాజంలో మన ధార్మికతను

మూలాలతో సహా పెకలించడం కోసం

వందల సంవత్సరాల నుండి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఎవ్వరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా

హిందూతనం ప్రతి ఒక్కరి వారసత్వం

గుర్తించండి,!!!

హిందూ మతం కాదు

ఇది ఒక వేదామృతం

ఒక క్రమబద్ధమైన జీవనశైలి మాత్రమే…..

ఎం.అనసూయ, సైదరాబాద్, హైదరాబాద్, మొబైల్ నెం 9440235956

Related posts

మధుర భాష మన తెలుగు

Satyam NEWS

అమ్మ ఓ జీవనది

Satyam NEWS

అమ్మ పలుకు

Satyam NEWS

Leave a Comment