27.7 C
Hyderabad
March 29, 2024 04: 17 AM
Slider కవి ప్రపంచం

చిరుకాంక్ష

#Sandhya Sutrave New

నూతన సంవత్సరం

నవ్య ఆశలు ఆశయాల

చిగురు తొడిగి

అనుసరణ మార్గంలో

మొగ్గయై బాధ్యత

బరువుల అనుసంధానమై

లక్ష్య‌సాధనదిశగా ఎదిగి

పొందే ఫలాలు ఫలితాల్లో

ఒదిగి పూచే పూవై

అందరి మంచిని కోరి

సర్దుబాటు ఫలంలో

అందరి హృదయాల్లో పండై

విరిసిన వసంతంమై

కలకాలం సాగే ప్రవాహంమై

గతించిన వర్షంలోని చేదు

అనుభవాల గుణపాఠంతో

వెలిసిన వర్షంలా

అలసటల ఘర్మజల

చినుకులు ఒడిసిపట్టి

అందరికి ఆనందాలు పంచి

ఒకింత శ్రధ్ధను ఆరోగ్యంపై పెంచి

జంకు ఫుడ్డు జోరు తగ్గించి

స్వయంపాకం అలవోకగా

అమలు చేసుకొనేతనం

తరం తరం నిరంతరంగా సాగించి ఆయుప్రమాణం ,మనశ్శాంతి, మనుగడలతో చెరుకురసంలా

కాసులకాంతితో  కొత్త పయనం

నవవత్సరంలో ఆనందంగా

సాగాలని చిరుకాంక్ష

సంధ్య సుత్రావె, ఫోన్: 9177615967, హైదరాబాద్, 500065

Related posts

హైదరాబాద్ నగర వైభవాన్ని మరింత పెంచాలి

Satyam NEWS

మాదగలకు మంత్రివర్గంలో స్థానం కావాలి

Satyam NEWS

ఏపి ఇన్ చార్జి సీఎస్ గా విజయానంద్

Satyam NEWS

Leave a Comment