37.2 C
Hyderabad
March 28, 2024 18: 22 PM
Slider కవి ప్రపంచం

యశస్తోరణం

#Sailaja Mitra

ఎదురయ్యే ఆశల్లో ముగ్గులు తోరణాలు

పొలాల కడుపులు నింపే పంటల పారిజాతాలు

గుమ్మం నుండి గుమ్మం దాకా ఆనందం

ఒక పండగ దృశ్య పరంపర, పలుకు నుండి ఫలం వరకు..

సమస్తం ద్విగుణీకృతం చేసే ఋతు ఆవిష్కరణతో

ఎండిన నది అయినా జలపాతాల తరంగంలా మారి

ఆత్మీయతల్ని ఆర్థ్రత చేసే ప్రతి క్షణానికి ఆహ్వానం..

అనుబంధాల అవని గుండెల్లో ప్రాణ శక్తి వెలుగులు..

ఈ సమయం ఆహ్వానంలా ఎదురు వస్తోంది

భోగి మంటల వాద్య బృందమవుతుంది

మకర సంక్రాంతి పూలతో, పండ్లతో హృదయ రూపాల్ని తలపిస్తుంది

కనుమ ఒక తరం నుండి మరో తరానికి మనిషి కథను ప్రస్తావిస్తుంది

వాస్తవాల్ని మరచిపోతే జీవిత గమనం లేదు

అనుభూతుల్ని వదిలేస్తే మనోవిష్కరణకు తావు ఉండదు

పండగల సంబరాల మధ్య మనిషి మనోగతం

కాలం జాడల్లో అవసరాలతో

అవి తీరే ఆలోచనలతో జీవనం సాక్షీభూతం!

మానవాళికి నిత్య యశస్తోరణం.

శైలజామిత్ర, హైదరాబాద్‌

Related posts

సంక్షేమం, అభివృద్ది ఈ రెండు మా ప్ర‌భుత్వానికి కళ్ళు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ

Satyam NEWS

అప్పు తీర్చకపోతే న్యూడ్ ఫొటోలు పెడతామని బెదిరింపులు: యువతి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment