27.7 C
Hyderabad
April 25, 2024 09: 56 AM
Slider కవి ప్రపంచం

సంకురాత్రి

#yaminikolluru

ఉత్తరాయణం మహాపుణ్యకాలం

సందడేసందడి అంతట కోలాహలం

తరతరాల ఆచారం సత్సాంప్రదాయం

తిరుప్పావై భక్తిపారవశ్య మాసం

గోదారంగనాధుల కల్యాణవైభోగం…

అందంగా అలంకరించిన  లోగిళ్ళు

గుమ్మంకి వేలాడే బంగరుబంతులు

భగభగమనే భాగ్యాలనిచ్చే భోగభాగ్యాలు

రంగురంగుల ముద్దొచ్చే రంగవల్లులు

ముచ్చటగా కొలువుతీరిన గొబ్బెమ్మలు ….

పాటలతో అలరించే బసవన్నచిందులు

హరిలోరంగ హరి హరిదాసులు

చిన్నారులకి పోసేరు భోగిపళ్ళు

సంస్కృతిని తలపించే బొమ్మలకొలువులు

కొత్తఅల్లుళ్ళరాకతో సందడులు

పల్లెల్లో కనువిందుచేసే కనుమందాలు

ఇంటికిచేరే బంగారు ధాన్యపుసిరులు

కోడిపుంజుల ఎడ్లపందాల పోటీలు

గాలిలో స్వేఛ్ఛగా ఎగిరే పతంగులు

తియ్యదనాల మూడురోజుల సంకురాత్రి…..

యామిని కోళ్ళూరు

Related posts

విజయనగరం జనసేన పార్టీ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు..!

Satyam NEWS

Sale Diabetes Cures Home Remedies Herb For Blood Sugar How To Get Sugar Levels Down Fast

Bhavani

సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

Leave a Comment