24.7 C
Hyderabad
March 29, 2024 07: 08 AM
Slider కవి ప్రపంచం

భోగ భాగ్యాల సంక్రాంతి

#Vedaardham Madhusudhana Sharma

భానుడు మకర రాశిలో ప్రవేశమే సంక్రాంతి

ఉత్తరాయణ పుణ్యకాలమే సంక్రాంతి

తెలుగు సంస్కృతీ సంప్రదాయాల మేళవింపే సంక్రాంతి

చిన్నా పెద్దల సరదాల సందడే సంక్రాంతి.

ఇండ్లముందు అందమైన రంగవల్లులతో

గుమ్మాలకు మామిడి ఆకులతో

బంతిపూల తోరణాలతో

గంగిరెద్దుల నాట్య విన్యాసంతో

హరిదాసుల సంకీర్తనలతో

కొత్త అల్లుళ్ల అలకలతో

సంక్రాంతి పర్వదినాన

ప్రతి ఇంటా కోలాహలం.

ఆత్మ విశ్వాసం పెంపొందేలా

గాలిపటాల స్వైర విహారం

మానసిక చైతన్యం పెంపొందెలా

భోగి మంటల దహనం

చీడ పీడలు తోలగేలా

నువ్వులు,రేగు పండ్లతో స్నానం

శుభాన్ని చేకూర్చేలా

అందమైన గొబ్బెమ్మల కూర్పు

సంక్రాంతి పర్వదిన సంరంభం.

మానసిక ఉల్లాసాన్ని కలిగించే

కోడిపందేలు,ఉయ్యాలాటలు

పాడి పంటలు ఇల్లు చేరగా

ఆనందంతో ఎద్దుల పందేలు

సకల సంపదలు అందించిన

పశువులకు అలంకరణలు

జీవితానికి ఆనందాన్ని అందించిన

ప్రకృతికి కృతజ్ఞతా రూపమే సంక్రాంతి.

వేదార్థం మధుసూదన శర్మ, కొల్లాపూర్,నాగర్ కర్నూల్(జిల్లా) 9063887585.

Related posts

మెట్రో కారిడార్ ను పరిశీలించిన సిటీ నేతలు

Satyam NEWS

హుజూర్ నగర్ లో బిజెపి శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం

Satyam NEWS

వెట్టిచాకిరి కార్మిక కోడ్ లు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment