32.7 C
Hyderabad
March 29, 2024 10: 46 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి సందడి

#Yalamarthy Anuradha

ధాన్యపు సిరులు ముంగిట్లో

అనురాగ పంటలు కుటుంబంలో

రంగురంగుల ముగ్గులతో

వాకిళ్లు అలరారు

ముద్దబంతులు శిరసున ధరించి

గొబ్బెమ్మల సోయగాలు

హరిదాసుల కీర్తనలు వీనుల విందు

గోమాత దర్శనం కనులకు అపురూపం

పట్టు పరికిణీలతో పసిపిల్లల చిందులు

కొత్త దుస్తులతో కళకళలాడుతూ పెద్దలు

పిండి వంటలతో వంటిల్లు ముస్తాబు

చలోక్తులతో భోజనశాల నిండుగా రక్తసంబంధీకుల కలయిక అబ్బురం

అనుబంధాల కేరింతల సవ్వడి అద్భుతం

బంధాల వెల్లువలో ప్రయాణం

సంక్రాంతి పండుగ తెచ్చేను ఆనందాల హేళి

యలమర్తి అనూరాధ, హైదరాబాద్ 9247260206

Related posts

మహేష్ బాబు పుట్టిన రోజున అభిమానులు మొక్కలు నాటాలి

Satyam NEWS

పట్టించుకునే నాథుడు లేక అనాథలా మారిన గురుకుల పాఠశాల

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS

Leave a Comment