28.7 C
Hyderabad
April 20, 2024 09: 30 AM
Slider కవి ప్రపంచం

వర్ణరంజితం పల్లె దారి

#Sandhya Sutrave New

నిజంగా పట్నంలో  సంక్రాంతి

అది పల్లెదారి పట్టింది

ఉన్నకాస్త సెలవులు

హ్యాపీ గా ఉన్నతంగా

గడిపాలన్న సంతృప్తి కోసం

ఎప్పుడెప్పుడా అని

పట్నం దాదాపు సగం అయ్యింది

ఎంత కష్టమైన సాలుకోసారి

తమ వారికై తమ ఊర్లకు

పరుగు పెట్టించింది

రకరకాల పంటలకు  లోగిళ్లు

ప్రేమ ఆప్యాయతలకు పొదరిండ్లు

మామతానురాగల మగాణులు

పట్నవాసంలో లేదీ ఆచూకీ

భోగి మంటల్లో ఆహాన్ని వదిలి

కుటుంబ ప్రేమ వెచ్చదనం పంచుకొని

కళ్ళా పి చల్లిన ముంగిళ్ళు

పచ్చతోరణాల  స్వాగతాలతో

పల్లెతల్లి రారమ్మని

తన ఒళ్ళోకి పిలుస్తుంది

సంప్రదాయ పరికిణి ల్లో

గాజుల గలగలల్లో

మంజీరాల సవ్వడిలో

ముంగురుల సవరింపులతో

ఆడపడుచుల అందమైన

దృశ్యమాలిక అల్లుతుంది

బసవన్నల రాక కోడిపందెలు

గాలిపటాల జోరు దానికి తోడు

మ్యూజిక్ హోరు లో

నిమగ్నమైన యువత

పిండి వంటలు నువ్వులడ్డూ లతో

వర్ణ శోభితమే వడ్డించిన విస్తరి

పంటల్లో ముఖ్య భూమిక

పశువులు వాటి గుర్తింపుకై

అలంకరించి పూజించుట

కనుమ వేడుక కనువిందు సాంప్రదాయం

తమ వారికోసం తమ పల్లెకు

రప్పిస్తున్న సంక్రాంతి పండుగ

పల్లెదారి పట్టిందనటంలో

సందేహమే లేదు.

సంధ్య సుత్రావె , పాతనగరం , హైదరాబాద్ ఫోన్ : 9177615967

Related posts

రాజంపేట లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం

Satyam NEWS

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

Satyam NEWS

ఆర్మూర్ లో అల్లూరి సీతారామరాజు 96వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment