28.7 C
Hyderabad
April 20, 2024 03: 31 AM
Slider కవి ప్రపంచం

అమృతం కన్నా మధురం

#shyamalanew

అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ
అమ్మ భాష కంటే మధురం అనుకోను
అమ్మ కడుపులో నేనున్నప్పుడు
అమ్మ కమ్మనైన తెలుగు నే విన్నాను
నన్ను కనే కష్టంలో అమ్మ
‘ అమ్మా ‘ అంటే
వెలుగు చూస్తూ భయంతో నేను కేరుమన్నా
కన్నా, బుజ్జి ..అమ్మ పిలుపులతో పులకించా
అమ్మ లాలి పాటతో పవ్వళించా హాయిగా
నా తొలి తెలుగు పలుకులు అత్త..తాత
ఆపైన అమ్మ, లాల, బిక్కి, ఆము..ఎన్నెన్నో
నా ముద్దు ముద్దు తెలుగు అందరికీ విందే
మళ్లీ మళ్లీ నా మాటలు వింటూ అంతా వినోదాలే
పలక పట్టి అ, ఆ, ఇ, ఈ ..అచ్చులు దిద్దా
క, ఖ, గ, ఘ..అంటూ హల్లులు గట్టిగా నేర్చా
అమ్మ , అమ్మమ్మ చెప్పిన కథలు
నాన్న కమ్మని కబుర్లు, తాత పాడిన పద్యాలు
బడిలో మాస్టారు చెప్పిన మంచి మంచి పాఠాలు
అన్నీ ,అన్నీ అచ్చమైన అమ్మ భాషలోనే
ఆడినా, పాడినా, నవ్వినా, ఏడ్చినా తెలుగే
తెలుగు భాష తోడుతోనే నేటిదాకా ఎదిగా
ఎన్ని భాషలు నేర్చినా ఎనలేని భాష తెలుగే
తెలుగు వెలుగులోనే కడదాకా నా పయనం!

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

జె.శ్యామల

Related posts

విజయనగరం పైడితల్లి ఆలయ అభివృద్ధి విస్తరణ కు చర్యలు

Bhavani

పల్నాడులో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడు

Satyam NEWS

ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం

Satyam NEWS

5 comments

విరించి February 21, 2023 at 11:43 AM

అమ్మ భాష పై మక్కువ, అమ్మభాష కమ్మదనం మీ ప్రతీ పదంలో, ప్రతీ అక్షరం లో కనిపించింది. పరభాషా వ్యామోహం నుంచి బయట పడ్డప్పుడు అమ్మ భాష గొప్పదనం తెలుస్తుంది… అమ్మభాష అమృతం కన్నా గొప్పదని చాలా చక్కగా చెప్పారు..అభినందనలు శ్యామల గారు.

Reply
J+GuruPrasad February 21, 2023 at 1:50 PM

From J GuruPrasad
Excellent narration by smt Shyamala garu
Regarding mother’s affection
From J GuruPrasad

Reply
Mramalakshmi February 21, 2023 at 2:15 PM

కవిత బాగుంది శ్యామల మేడం గారికి ధన్యవాదములు

Reply
Satyam NEWS February 21, 2023 at 4:27 PM

Thank you

Reply
Gannavarapu+Narasimha+Murty February 21, 2023 at 6:54 PM

అమ్మ భాష మీద వ్రాసిన గేయం చాలా బాగుంది.తెలుగు గొప్పదనాన్ని బాగా చెప్పారు
రచయిత్రి గారికి అభినందనలు

Reply

Leave a Comment