24.7 C
Hyderabad
March 29, 2024 06: 15 AM
Slider కవి ప్రపంచం

ఆమె

#shyamalanew

ఆశలు..ఆశయాలతో ఆమె

గమ్యం చేరాలంటే గండాలెన్నో

ఇంటా బయటా సమస్యల గుండాలెన్నో

ఆత్మహత్యకు పురిగొలిపే

సాధింపులు.. వేధింపులు

అత్యాచారాలు..హత్యాచారాలు

విద్యాలయాలు,కార్యాలయాలు

ఒకటనేమిటి..ఎక్కడా లేదు భద్రత

కొత్త సాంకేతికత ఆమె పాలిటి కొత్త కొరివి

అనునిత్యం ఎందరో ‘ ఆమె ‘లు ఆహుతి

హక్కులన్నీ హుళక్కి కాగా

వేదనలో ఉన్న ఆమె

ప్రకృతి పలకరించగా పరికించిందటు

చుట్టూ పరుచుకున్న గులక రాళ్లు

వాటి మధ్య గర్వంగా తలెత్తి నిలిచిన గడ్డి పరక

కొట్టేసిన చెట్టు  మొదలు లోంచి

కొత్తగా చివురింతల చిరునవ్వులు

పదేపదే విరిగి పడుతున్నా

పట్టువిడువక ఎగసి పడే అల

ప్రే’రణ’ పాఠం పట్టుబడింది ఆమెకు

ఆత్మ విశ్వాసమే ఆయుధంగా

నిరంతర చైతన్య శీలిగా

సాగుతూనే ఉంది.. పోరుతూనే ఉంది

ఎప్పటికైనా  గెలుపు ఆమెదే!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

జె.శ్యామల

Related posts

సెప్టెంబర్ 11 నుంచి స్టార్ మా లో మామగారు సీరియల్

Satyam NEWS

“నువ్వు వెళ్ళే ఈ రహదారికి జోహార్” వెబ్ మూవీ పోస్టరు ఆవిష్కరణ

Satyam NEWS

గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు

Murali Krishna

6 comments

J+GuruPrasad March 8, 2023 at 7:16 AM

From J GuruPrasad
Excellent narration by smt Shyamala garu

Reply
Satyam NEWS March 8, 2023 at 1:15 PM

Thank you

Reply
Dr.Ch.Nagamani March 8, 2023 at 8:38 AM

The poem mirrors the challenges faced by women in our society in a realisic way. Hinting on the fact that gender equality is still a distant dream the writer ends on a positive note saying that they move forwatd braving the odds. Congratulations to Smt.Syamala

Reply
Satyam NEWS March 8, 2023 at 1:15 PM

thank you

Reply
Mramalakshmi March 8, 2023 at 11:04 AM

Happy womensday madam?

Reply
Satyam NEWS March 8, 2023 at 1:15 PM

Thank you

Reply

Leave a Comment