35.2 C
Hyderabad
May 29, 2023 20: 27 PM
Slider కవి ప్రపంచం

‘శోభా’ గమనం

#shyamalanew

కుహూ కుహూ! కుహూ కుహూ!!

కోకిలమ్మ  ‘ శోభో ‘దయం  చెప్పింది

అవును..ఇది ఉగాది ఉషోదయం

కొత్త ఆశలు చిగిర్చే నూతన వసంతోదయం

శుభకృత్ ఓ వత్సర కాలానికి

‘ శుభం ‘ పలుకగా

శోభకృత్ మరో వత్సరానికి శ్రీకారం చుట్టింది

శోభకృత్..అందంగా ఉంటుందని అందరి ఆశ

అందంగా అంటే ఆనందంగా అనే కదా

అదీ .. ఏ ఒక్కరి ఆనందమో కాదు

సర్వ మానవ సుఖసంతోషాలు

అది సిద్ధించాలంటే

నేను, నువ్వు, మీరు, మనం

అందమైన  అంతరంగాన్ని

సంతరింపజేసుకంటే

కుళ్లు, కుత్సితం, కుసంస్కారం

అవలక్షణాలను అంతం చేసి

సమత, మమత, మానవతలతో

వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుంటే

‘శోభకృత్ ‘ కాదా సార్థకం?

ఇది నిజం..

మనతోనే అసలు సిసలైన

 ‘ శోభా’ గమనం !

 రారండి అందరూ

 అటువంటి శోభకృత్ కు

 ఆలపిద్దాం ఆహ్వాన గీతం

జె.శ్యామల

Related posts

తహసిల్దార్ ఆఫీసు భద్రతకు కొల్లాపూర్ పోలీసుల చర్యలు

Satyam NEWS

పునర్నవి-రాహుల్‌ల మధ్య సంథింగ్‌ సంథింగ్‌

Satyam NEWS

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

Bhavani

4 comments

Mramalakshmi March 22, 2023 at 1:40 PM

ఉగాది కవిత బాగుంది మేడం 👌💐

Reply
ఇలపావులూరి వెంకటేశ్వర్లు March 22, 2023 at 1:50 PM

ఉగాది ప్రాముఖ్యతను, విశేష తను తెలిపే కవిత. రచయిత్రి గారి కి అభినందనలు

Reply
Gannavarapu+Narasimha+Murty March 22, 2023 at 1:54 PM

శోభకృతు ఉగాది కవిత గండు కోకిల గీతంలా,లేమావి చిగురులా, చాలా బాగుంది.

Reply
J+GuruPrasad March 22, 2023 at 2:56 PM

From J GuruPrasad
Excellent narration by smt Shyamala garu
From J GuruPrasad

Reply

Leave a Comment

error: Content is protected !!