35.2 C
Hyderabad
May 29, 2023 21: 27 PM
Slider కవి ప్రపంచం

కొన్ని నవ్వులివ్వు  చాలు

#shyamalanew

దైవమా!

సిరి సంపదలడగను..భోగ భాగ్యాలడగను

నిత్యం కొన్ని నవ్వులివ్వు, చాలు

నాతోటి వారికీ నవ్వుల భాగ్యమివ్వు

నవ్వు లేని రోజు.. నవ్వ లేని రోజు

నరకమన్నది  ముమ్మాటికీ నిజం

స్నేహ భావ సంకేతం చిరునవ్వేగా

నగవులే నగలైతే అందానికి అందమేగా

ఒక్కో నవ్వు ..ఒక్కో పులకింత

పగలే చల్లని వెన్నెల..అది అమ్మ నవ్వు

పరమాత్ముడే ప్రత్యక్షం..అది పాప నవ్వు

జల తరంగిణి ..మనసైన మగువ నవ్వు

మధుర మురళీ రవం   ప్రియతముని నవ్వు

ఎన్నెన్ని నవ్వుల్లో ఎంత ఆహ్లాదమో

నలుగురు కలిసి నవ్వే వేళ

నవ్వుల రుతువే నడచి రాదా

కానీ ..వెకిలి , మకిలి నవ్వులొద్దు

బాధించే..వేధించే నవ్వులొద్దు

అచ్చంగా..స్వచ్ఛంగా నవ్వు

నవ్వు..నవ్వించు

అదే మనిషిని బతికించు

( మే 7 వ తేదీ ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా )

జె.శ్యామల

Related posts

(Free|Trial) – Clen Weight Loss Pills Smart Burn Weight Loss Pills

Bhavani

BJP vs TRS T20: బాల్స్ తక్కువ కొట్టాల్సిన రన్స్ ఎక్కువ

Satyam NEWS

రాజంపేట లో విక్రమ్  కోలార్ నగర్ KA-07 షూటింగ్ సందడి

Satyam NEWS

3 comments

J+GuruPrasad May 7, 2023 at 7:14 AM

From J GuruPrasad
Excellent narration by smt Shyamala garu
J GuruPrasad

Reply
Ramesh Koppisetty May 7, 2023 at 12:19 PM

Sreemathi Shyamala garu ki,

First of all thank you for reminding us about this ‘laughing day’ ! You are a genius to link reality with the occasion.

Laughter is the medicine ani telusu, but you have narrated ‘ laughing day’ tied with pure laughter! Extremely thankful for such a great article/poem!

Reply
Gannavarapu+Narasimha+Murty May 7, 2023 at 8:24 PM

నవ్వు గొప్పతనాన్ని. చాలా బాగా చెప్పారు
రచయిత్రి గారికి అభినందనలు

Reply

Leave a Comment

error: Content is protected !!