33.2 C
Hyderabad
April 26, 2024 02: 05 AM
Slider కవి ప్రపంచం

ప్రేమించు

#PVS Krishnakumari

ఏమిటి ఈ” వాలంటైన్ డే “?

ప్రేమికుల రోజంటారు

జీవనది వంటి ప్రేమకు,

ప్రేమించటానికి ఒకరోజు చాలా?

భూమ్యాకాశాలు, జల,జీవ రాశులు

సూర్య చంద్రులు, నక్షత్రాల

సృష్టి జరిగినప్పుడే

 ప్రేమైక స్వరూపమైంది ఈ ప్రపంచం

వర్ణించ నలవికాని, పవిత్ర మైన

మనోభావాల అందమైన

అస్పష్ట రూపమే ప్రేమ

అమలిన హృదయాల స్పందన, ప్రేమ

అనురాగ పూరిత స్పర్శ ప్రేమ

సుగంధ పరిమళాలను వెదజల్లే

చిరునవ్వుల మాటున దాగే

మనోహర రూపం ప్రేమ

ఆ మనోహర రూపం నేడు

కృంగి కృశించి , ‘ఏమిటి ఈ వైపరీత్యం ‘

అని గగ్గోలు పెడుతున్నది

విచ్చలవిడి శృంగారం, సహజీవనం

కిరాతకపు ప్రతీకారేఛ్ఛలతో

తనకి వికృత రూపాన్ని ఇస్తున్న

యువతీ యువకులను

దీనంగా వేడుకుంటున్నది ‘ప్రేమ’

” నన్ను బతికించండీ ” అని.

కన్న బిడ్డలుగా తల్లి తండ్రులని

 ప్రేమించండి

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ

తోబుట్టువులని ప్రేమించండి

మదిలోని భావాలను

పంచుకొనే స్నేహితులని

ప్రేమించండి

పవిత్రమైన మూడుముళ్ళతో

ఏడడుగులతో నీతో

సహజీవనం చేయటానికి వచ్చే

నీ జీవిత భాగస్వామిని

నిరంతరం ప్రేమించండి

మల్లెపూవు వంటి స్వచ్ఛమైన ప్రేమని

జగతి నంతటికీ పంచుతూ

ఒకరోజు కాదు, ఒక జన్నంతా

ప్రేమని పంచుతూనే ఉండండి

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

నాగార్జున సాగర్ నిర్మాత ముక్త్యాల రాజా వర్థంతి నేడు

Satyam NEWS

అమెరికాలో ఏపి ప్రతినిధిగా రత్నాకర్

Satyam NEWS

మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో “జెట్టి”

Satyam NEWS

Leave a Comment