35.2 C
Hyderabad
April 24, 2024 14: 39 PM
Slider కవి ప్రపంచం

యువత మేలుకో..

#PattemVasantha

ప్రేమ అనే రెండు అక్షరాలే

అన్నింటికి మించిన రూపాలు

స్వచ్ఛతకు ఇష్టతకు మరో పేరు

నవతరానికి నాంది పలికిన

ఈ ప్రేమికుల దినోత్సవం రోజు

టిక్ టాక్ లో వీడియోలు హోరు

వాట్స్అప్ స్టేటస్ సంచలనాలు

సోషల్ మీడియా నెట్వర్క్ జోరు

సింగిల్స్ ఏం పాలుపోక బేజారు

కపుల్స్ ఎక్కడ కలువాలని హైరానా

ఏమిటి ఈ విపరీత పోకడలు….?

ప్రపోజ్ డే నుండి మొదలుకొని

హగ్గింగ్ డే, కిస్సు డేలు అంటూ

విడిపోయే రోజు వరకు విస్తరించిన

ఈ సంస్కృతి ఎందుకు మనకు..?

ప్రపంచం మొత్తం ఈరోజు కోసమే

ఎదురుచూస్తూ తపన పడే రోజు

పాశ్చాత్య దేశాల మోజులో పడి

మనం ఎటువైపు పయనిస్తున్నాం.

రెండు మనసులు పెనవేసుకున్న

మధుర జ్ఞాపకాలు ప్రేమను

పెద్దల ఆమోదంతో ఏకమైన ప్రేమ

అందరి ఆశీస్సులతో కలకాలం

నిలిచి రేపటి తరానికి వారధిగా

 సంస్కృతి సాంప్రదాయాలకు

నిలువుటద్దమై చిరకాలమవ్వాలి

చరిత్రలో నిలిచిన తాజ్ మహల్

ప్రేమ చిహ్నమే కదా…..???

ప్రేమ కోసం పరువు హత్యలు

కుల మతాల  కుమ్ములాటలు

ప్రేమించలేదని యాసిడ్ దాడులు

క్షణికావేశంతో మారణహోమాలు                                 

ఈ విపరీత ధోరణికి మంగళం పాడి

ప్రేమ అనే ఆకర్షణను విధిలించి

దేశ భవిష్యత్తుకు పునాదులైన

ఓ యువతా మేలుకో….

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

కువైట్, ఖతార్ లో మాస్క్ లేకపోతే మూడు నెలల జైలు

Satyam NEWS

పోలీసుల పై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు

Satyam NEWS

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సత్తెనపల్లిలో అన్నదానం

Satyam NEWS

Leave a Comment