40.2 C
Hyderabad
April 19, 2024 16: 19 PM
Slider కవి ప్రపంచం

యువతీ యువకులారా

#K.HarinathVD

యువతీ యువకులారా

విరిసీ విరియని మొగ్గలారా

తెలిసీ తెలియని వయసులో

ప్రేమ మత్తు ముసుగులో

దొర్లుతున్న జంటలారా!

గుండెలవిసే హేల

ప్రేమ జంటల బాధలు

మదిన మంటలు రేపును

మనసు చెదిరే గాధలు

ప్రేమ విఫలమై

కుత్తుకపై కత్తులు నూరేదొకరు

మోముపై యాసిడ్ దాడులింకొకరు

కన్నవాళ్ళని కాలదన్ని

రెక్కలొచ్చిన పక్షిలా

ఎగిరిపోదురింకెందరో..?

కాలమెంత కఠినమో

ప్రేమ లోయలో పడదోసి

చూడు చోద్యము నిరతము

కలసిరాని జంట వ్యధలు

కాలకూట విషమాయెనుగా..

వెర్రితలల వ్యాలంటైన్స్

రగిలించును కార్చిచ్చును

తెలుసుకోండి ఈ నిజం

ఆకర్షణ పారద్రోలి

ఆవేశం కాలరాచి

కన్నవారి జాడనెంచి

మసలుకోండి

యువతులారా…యువకులారా…

( వ్యాలెంటైన్స్ సందర్భంగా)

కె.హరనాథ్,  9703542598.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి

Satyam NEWS

వేసుకో నా రాజా: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్

Satyam NEWS

తపన

Satyam NEWS

Leave a Comment