37.2 C
Hyderabad
April 19, 2024 13: 14 PM
Slider కవి ప్రపంచం

నవ ముకురం

#Kondapally Niharini

బాల్యాన్ని తుడిచి, బాధ్యతల

బండిని ఇంకా ఎక్కకముందే 

ఇంటిమాటలు కొర్రాయిలవుతాయి

అన్నాదమ్ములమధ్య  ఈడుతేడాలనెన్నుతూనే

ఆడపిల్లగ లింగ నిర్ధారణ వ్రణాల్ని పుట్టిస్తారు. 

బడి ఆవరణేమీ హృదయావరణ కాదు

లేతకొమ్మలకు అంటుగట్టి , లేనివన్నీ అంటగట్టి,

ఒకటేదో దుమారాన్ని రేపుతారు.

కళాశాల కళ దరిచేరగానే

వేట! వేట!మగకన్నుల వేట !

ప్రేమించానంటాడు,ప్రణయమూర్తినంటాడు.

పెళ్ళి మురిపెపుపువ్వై పూస్తుంది

చనువుమొత్తం కొత్తతీరం చేరేదాక

ఆగలేని దాంపత్య వాదనల గోదాముల వెనుక

చెప్పాల్సిన నిజాల్నిదాచేస్తుంటాడు

ఇది అది అని చెప్పలేనంత విచిత్ర మార్పును రహస్యంగా చేరవేస్తుంటాడు

దుఖః చిత్రాన్ని పగిలిన అద్దంలో చూపుతాడు.

ఊబి అనకున్నా, కారాగామనకున్నా , ఏకపక్ష  నిర్ణయాల వివక్ష చాపక్రింద చేరేదాకా విదిలించలేని బంధనం నట్టింట్లో కూర్చుంటుంది.!

ఇదిగో  -ఇట్లా మహిళాదినోత్సవాల ప్రతిబింబాన్ని  కొత్త అద్దంలో చూసినప్పుడు

ఎక్కడలేని  ఆనందం ,

చెప్పగరాని మనోధైర్యం ముందుకొస్తుంది

-డా।। కొండపల్లి నీహారిణి

Related posts

జూన్ 4న‌ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

అంబర్ పేట్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Satyam NEWS

Leave a Comment