28.2 C
Hyderabad
April 20, 2024 12: 55 PM
Slider కవి ప్రపంచం

రెండో సగం?

#NutenkiRavindar22

కాంతిపుంజాలు వాళ్ళు

లోకాన్ని వెలిగిస్తుంటారు

అప్పుడప్పుడు

తగులబెడుతుంటారు కూడాను!

గొప్ప రహస్యమేదో

దాగి వుంది వారిలో

ఆ గుట్టు నీకు చిక్కదు

వారి చేతిచెఱల నుండి

నీ జట్టుకు విముక్తి లభించదు

ఆయువునిచ్చే అమ్మలు

అనురాగం పంచే రమలు

ఆటపట్టించే చెల్లెమ్మలు

అదిలించే బామ్మలు

అలరించే అంగడి బొమ్మలు

అన్నీ వాళ్ళే-

వాళ్ళు మలుచుకున్న

తోలుబొమ్మవు నువ్వు

ప్రపంచమంతటా

నీ ఆధిపత్యమే

అదేమి చిత్రమో

నీ పైన తన పెత్తనం!

ఆకాశంలో సగమంటారు 

నిజానికి

గగనమంతా ఏకమొత్తంగా వాళ్ళే

నువ్వు మాత్రం

అంతరాళంలో వ్రేలాడుతున్న

ఓ ఖగోళ శకలానివి!

నమ్మవు 

కబ్జాకు గురైన నీ రెండో సగాన్ని

నువ్వు సైతం గుర్తించ లేవంటే

మరదే నేటి విషాద మంటే!

నూటెంకి రవీంద్ర, 9491533295.

Related posts

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా

Satyam NEWS

పేద విద్యార్థికి సరస్వతి కటాక్షం ఇప్పించిన ఉప్పల

Satyam NEWS

మహిళల భద్రతకు 20 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్

Satyam NEWS

Leave a Comment