36.2 C
Hyderabad
April 23, 2024 22: 04 PM
Slider కవి ప్రపంచం

నేనొక వనితనై

#Dr.ChintapallyUdayaJanakiLaxmi

అమ్మ పేగు తెంచుకుని

పుట్టిన మొదటి క్షణంతో

వాత్సల్య వీచికల

సౌరభాల్ని ఆశ్వాదించా పసికందునై

కాలమనే

కల్పవృక్షంలో

అల్లుకున్న లతనై

సంకల్పాలను తీర్చుకునే

బాల్యాన్ని సావాసాలతో

ఆటపాటలతో

చదువు సంధ్యలతో

ఆనందంగా అనుభవించా

ఆశలు పెంచుకుంటూ

యవ్వనాన్ని పరుచుకుంటూ

పొంగిన వయసుతో ఉరకలేస్తూ

అమాయకంగా లోకాన్ని చూస్తూ

వాన చినుకుల జలధారలు

భూమి తల్లి ఓడిలో ఇంకిపోయి

దప్పిక తీర్చుకున్న భూమి

పచ్చ చీర కట్టినట్టు

ఆకులతో యవ్వన చీర తొడిగా

నిరంతరం నిశ్చలమైన

నిర్మలమైన ఆలోచనలతో

పువ్వులు పూస్తూ

పరిమళాల సుగంధానికి

పరవశించిన తుమ్మెదకు

బందీ అయ్యా

ప్రేమ, మంచితనం అనే

తేనెలతో మాధుర్యాన్ని పంచుతూ

సంసారమనే ఇల్లును పెనవేసుకున్నా

చిన్న చిన్న ఆశలతో

చిగుళ్లు వేస్తూ

మొగ్గ తొడుగుతూ

చీకు చింతలతో

చిరు ఆనందాలతో గడిపేశా

నిరాశ నిస్పృహలు ఎదురైన క్షణంలో

ఆత్మీయ నేస్తం సాహచర్యంతో

భర్త బంధానికి చుట్టుకుపోయా

కష్టాల గాలివానలేన్నివచ్చినా

నష్టాల వడగళ్ళు ఎన్ని కురిసినా

కాలమనే కల్పవృక్షానికి

అల్లుకున్న లతనై 

జీవితం సాగించా

ఆదర్శంగా జీవించే

అనుబంధాల పందిరినై

అనురాగాల వల్లినై

ఆత్మీయతల చిగురాకునై

విలువలతో అల్లినపూతోటనై

సంస్కారాల తోరణమై

సాంప్రదాయంతో అంటు కట్టబడి

సంస్కృతిని పంచే వనితనై

నలుగురికి మేలు చేస్తూ…

‘నేనొక లతనై’ అల్లుకుపోయా….!

‘నేనొక వనితనై’ నిలిచి పోయా….!!

నేనొక వనితనై’ నలిచి పోయా….!!!

(అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)

డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి, వింగ్స్ ఇండియా పౌండేషన్ డైరెక్టర్, ఒంగోలు, Ph: 9440731068

Related posts

అనూహ్యంగా ఆర్ధిక శాఖ నుంచి ముగ్గురి సస్పెన్షన్

Satyam NEWS

హాల్ టికెట్ ఇవ్వకుండా 10 వ తరగతి విద్యార్థులను వేధించవద్దు

Satyam NEWS

గ్యార్మీ ఉత్స‌వాల‌కు హాజ‌రైన ఎంపీఆర్‌

Satyam NEWS

Leave a Comment