35.2 C
Hyderabad
April 20, 2024 15: 01 PM
Slider కవి ప్రపంచం

తానే

#Manjula Surya New

వెన్నెలకు ధీటుగా తాను

వేకువ కిరణమై తాను

తారలా తళుకులీనుతూ తాను

ధరిత్రిలా ఓరిమితో తాను

పూల సుగంధం తాను

పూరేకుల పరిమళం తాను

సృష్టికి ప్రతిసృష్టి తాను

తన సృష్టిలో రక్షణ లేక తాను

కత్తిలా దూసుకుపోయేది తాను

కాళిలా కదనరంగంలో  తాను

రాధలా అనురాగానికి ప్రతీక తాను

రోదసిలో తాను రోగులకు సేవ చేయుటలో తాను

ఉత్పాదనలో తాను సేవా రంగంలో తాను

రక్షణ తాను శిక్షణ తాను

అన్ని రంగాలను  రంగరించి

ఔపోసన పట్టింది తాను

విలక్షణ మూర్తిమత్వము తాను

జ్ఞాన వికసిత విశారద తాను

అనుబంధాల మూలస్తంభం తాను

అవి లతలా పాకేందుకు దోహద పడేది తాను

రాని విద్యే లేని రాణి తాను

మహామహులనే మట్టికరిపించే మహారాణి తాను

అన్ని హంగులున్న పంచవన్నెల చిలకే తాను

కాని బోయవాడి చేతిలో గాయపడుతున్న కోయిలే తాను

బలవంతపు ఆహుతికి దగ్ధమవుతున్నదే తాను

బలి అవుతున్నా తొణకదు తాను బరిలోంచి తొలగదు

పరుగెడుతూనే ఉంటుంది 

పోరాడుతూనే ఉంటుంది

తానేమిటో నిరూపిస్తూనే ఉంటుంది

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో)

మంజుల సూర్య , హైదరాబాద్

Related posts

నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

విధివంచిత

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam March 8, 2021 at 11:38 AM

బాగా రాసారు, అద్భుతంగా

Reply

Leave a Comment