28.7 C
Hyderabad
April 20, 2024 03: 41 AM
Slider కవి ప్రపంచం

ఓ మహిళా నీకు వందనం

#MuluguLaxmimaidhili22

ఆమె

ఓదార్పుకు మారుపేరు

సకల చరాచర జగత్తుకు మూలం

ఇంటింటా వెలిగే జీవన జ్యోతి

సృష్టికి ప్రతి సృష్టి చేసే మహిమాన్విత

గృహసీమకు ఆరాధ్య దేవత

ఎప్పుడూ తనవారి క్షేమం కోసం

ఆరోగ్యసూత్రాలు బోధిస్తూ…

కంటిపాపలా కాపాడుతుంది

అది..బంధమైనా..బాధ్యతైనా..

కనిపించని శత్రువుతో

అహర్నిశలు పోరాడి

ఎందరికో ప్రాణదానం చేసిన వైద్యురాలు

తన కర్తవ్యనిర్వహణలో

ప్రజా క్షేమమే పరమావధిగా

రక్షణ కల్పించే మహిళా పోలీసుగా

నిలిచిన దీక్షాపరురాలు

బాధితుల సేవలో

చేయూత నిందించే దయామయి

ఢిల్లీ నుంచి గల్లీ వరకు

చీపురనే ఆయుధం తో

కాలుష్య క్రిమిని అంతం చేసే

పారిశుధ్య కార్మికురాలిగా

కష్టించే శ్రామికురాలిగా..

అన్నింటా తానై..

శతాబ్దాలుగా ఎన్నో సవాళ్ళను

అధిగమించే చైతన్య దీప్తి..

అమృత మూర్తి..నీకు జోహార్లు

ఓ మహిళా నీ సహనం నీ తెగువ

నీ ధైర్యం,నీ దీక్షా దత్తత కు

వందనం పాదాభివందనం..!!

ములుగు లక్ష్మీ మైథిలి

Related posts

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎదురుతిరిగిన రెడ్లు

Bhavani

మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేరా?

Satyam NEWS

మన ఊరు మన బడి పాఠశాలను సందర్శించిన ఎంపిపి,ఆర్డిఓ

Satyam NEWS

Leave a Comment