39.2 C
Hyderabad
March 29, 2024 13: 18 PM
Slider కవి ప్రపంచం

పంజరంలో చిలక

#NellutlaSunitaNew

అణచివేత ల మధ్య ఆడపిల్ల బ్రతుకు అంధకారమయ్యే

అమ్మ కడుపులో ఉన్నప్పుడే వివక్షత మొదలయ్యి

ఆడపిల్ల పుట్టిందని అయ్యా అసహ్యించుకొని

అంధకార బంధురమైన కుటుంబ వ్యవస్థలో ఎన్ని  అగచాట్లు

తట్టుకొని ఎదిగే ఆడపిల్ల

అడుగడుగున నిషేధాలు

స్వేచ్ఛలేని పంజరంలో చిలకలా

ఆడపిల్లల జీవితాలు అణగారిన

నీటి బుడగలు

ఎన్నో విమర్శలు ఎదుర్కొని

అన్ని సమస్యలను తనకుతానే పరిష్కరించుకుని

అన్ని రంగాల్లో రాణించే రాణి రుద్రమదేవి కాదా ఆడపిల్ల అంటే

గృహలక్ష్మి  గా అన్నపూర్ణగా

అన్ని పాత్రల్లో ఒదిగిపోతూ

సమస్త సృష్టి ప్రకృతికి నిదర్శనంగా

నిలుస్తూ నిలువెత్తు ధైర్యలక్ష్మి కాదా ఆడపిల్ల అంటే

మంత్రిగా సలహాలు ఇస్తూ మమతల పంచె కల్పవల్లిగా

ప్రతి రంగంలో ప్రతిభ చూపుతూ

మహిళ శక్తి సాటిలేనిది గా

ఎదుగుతూ దిశా మార్గదర్శనం చేసేది

ఆడపిల్లలలో అమ్మ ను చూస్తూ ఆదరిద్దాం కాపాడుకోవడం సృష్టికి ఊపిరి పోస్తూ

(అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో)

నెల్లుట్ల సునీత, ఖమ్మం, చరవాణి 7989460657

Related posts

కొత్త రెవెన్యూ చట్టానికి సబ్బండ వర్గల పబ్బతి

Satyam NEWS

శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

Sub Editor 2

ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడుగా రుషి

Bhavani

Leave a Comment