37.2 C
Hyderabad
March 28, 2024 17: 42 PM
కవి ప్రపంచం

మహిళా విజయపథం

#Sandhya Sutravey

శిశువుగా,బిడ్డగా,

తోబుట్టువుగా,ఆలిగా

ఈజననచక్రంలో

సృష్టికి ప్రతి సృష్టి నిచ్చే

మార్గనిర్దేశి మహిళ

ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు

ఆమెకు ఆమెయేసాటి

ప్రేమానురాగాలు పంచుటలో

అమృతమూర్తి మహిళ

చలాకీతనం  చాకచక్యం

సొత్తుగా ,సతతం సకలపనుల

అష్టావధానంలో

ఇల్లు వాకిలి పిల్లలు

ఉద్యోగనిర్వహణ

చక్కబెడుతున్నదీ మహిళ

సమయస్ఫూర్తి విశ్లేషణ

విషయజ్ఞానంలో ఆమె దిట్ట ,

గౌరవంతో అంటారు ఆకాశంలో,

మహిలో మహిళ సగం అని

ఆమెలేని జగం లేదని

వాస్తవంగా చెప్తున్నదొకటి

జరుగుతున్నదొకటి

ఈనాడు మహిళ

సమస్యల ఊబిలో

కూరుకున్నది

అందుకే ఓ మహిళా ! ఆడదంటే,

ఆమె ఒక నవయుగ నిర్మాణానికి

భూమిక అని,ఆదిపరాశక్తి అని

సమ‍స్యలసాధనలో నిపుణ అని

అజ్ఞానాంధకారాన్ని తరిమే

జ్యోతిక అని నిరూపించుకో

ప్రతియేటా నిర్వహించే

మహిళాదినోత్సవంలో ఆడిపాడే

అల్పసంతోషివి కావని ,

స్వాభిమానం, ఆత్మవిశ్వాసంతో

నీచుట్టూ ఉన్నవారికి

చుక్కానివై , గొప్పవరంమై

సర్వశక్తులతో ఝంఝవై సాగిపో

సంధ్య సుత్రావె, సుల్తాన్ షాహి, హైదరాబాద్

Related posts

శుభకృదబ్దమిడును గాక శుభము మీకు

Satyam NEWS

సరికొత్త కాంతి

Satyam NEWS

అప్పుడే పండుగ‌..

Satyam NEWS

Leave a Comment