33.2 C
Hyderabad
April 25, 2024 23: 05 PM
Slider కవి ప్రపంచం

యుద్ధం చేస్తూనే….

#TurlapatiLaxmi

మార్చ్ 8

వచ్చేసింది.

మహిళలను గౌరవించడం

సన్మానాలు,సత్కారాలు

బహుమానాలు,పురస్కారాలు

సభలు,సెమినార్లు

ప్రసంగాలు,ప్రవచనాలు

బల్లలుగుద్ది,మైకులుపట్టి

గల్లీనుండి ఢిల్లీదాకనే కాదు

ప్రపంచమంతా.

బాగానేవుందా?

అంతా బాగానేవుందా?

మరి మనకేం కావాలి?

మనమేం కోరుకుంటున్నాం?

అత్యాచారాలు లేని

భ్రూణహత్యలు లేని

గృహహింస లేని

వివక్షత లేని

సభ్య సమాజం కావాలి

సమ సమాజం కావాలి

మనమేం చేయాలి?

మన తరం

ఈ తరం

ముందు తరం

ప్రతి రోజు యుద్ధం చేయాలి

ప్రతి చోట యుద్ధంచేయాలి

నిరంతరం యుద్ధం చేయాలి

చేస్తూనేవుండాలి.

(అంతర్జాతీయ మహిళల దినం -మార్చ్ 8 సందర్భంగా)

— తుర్లపాటి లక్ష్మి, 9704225469

Related posts

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన ములుగు జిల్లా ఎస్పి

Satyam NEWS

మంత్రి చెల్లుబోయినపై ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment