27.7 C
Hyderabad
April 24, 2024 07: 18 AM
Slider కవి ప్రపంచం

ఎదురీతలోనే ఆమె!

#J.Shyamala1

మహిళలను మభ్యపెట్టే

మహిళా దినోత్సవం మళ్లీ వచ్చింది

అన్ని రంగాల్లో అందెవేసిన చేయివంటూ

ఆర్భాటాలెన్నో చేస్తూ

ఆకాశానికి ఎత్తేస్తూ

సభలు..సమావేశాలు

ముచ్చట్లు..చప్పట్లు

అభినందనలు..పురస్కారాలు

పువ్వులు..నవ్వులు..విందులు

కానీ.. ఎన్ని మహిళా దినోత్సవాలొచ్చినా

ఏమున్నది గర్వకారణం?

ఆమెపై ఆగని ఆగడాలు అత్యాచారాలు..అమానుషాలు

ప్రేమ పేరుతో దాడులు.. హత్యలు

పెళ్ళి పేరుతో నిరంతర హింసలు

ప్రసంగాలలోనే సమానత్వం

చట్టసభలలో అదెంతో దూరం

డొల్ల చట్టలతో న్యాయం కల్ల

అయినా అస్థిత్వం కోసం

అహరహం ఎదురీతలోనే ఆమె!

జె. శ్యామల

Related posts

దీపాలు వెలిగించే కార్యక్రమం వెనుక లాజిక్ ఏమిటి?

Satyam NEWS

గుడ్ వర్క్: నిత్యావసరాలు పంచిన విద్యాశాఖ మంత్రి

Satyam NEWS

ఎడ్యుగ్రామ్ @ టెలిగ్రామ్ ద్వారా ఐఐటీ, నీట్ ప్రిపరేషన్

Satyam NEWS

5 comments

Mramalakshmi March 8, 2021 at 3:21 PM

Nice madam??

Reply
G N Murty March 8, 2021 at 3:55 PM

మహిళా దినోత్సవం మాద వ్రాసిన ఈ కవిత చాలా బాగుంది
రచయిత్రి చెప్పినట్లు మహిళా సాధికారత అంతా భూటకం
ఒక కఠోర వాస్తవాన్ని కళ్ళక కట్టినట్ల వ్రాసిన రచయిత్రి గారికి అభినందనలు

Reply
prabhakaramsivvam March 8, 2021 at 9:12 PM

మహిళా దినోత్సవం నాడు మహిళలపై జరుగుతున్న అన్యాయాలను తన కవిత ద్వారా విపులంగా వివరించినందుకు శ్యామల గారికి అభినందనలు.

శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి

Reply
prabhakaramsivvam March 8, 2021 at 9:23 PM

ప్రముఖ రచయిత్రి శ్యామల గారి ” ఎదురీతలోనె ఆమె ” చాలా బాగుంది.
రచయిత్రికి అభినందనలు.

శివ్వాం. ప్రభాకర్, బొబ్బిలి.

Reply
విరించి March 10, 2021 at 2:27 PM

మహిళలను మభ్యపెట్టే మహిళా దినోత్సవం మళ్ళీ వచ్చింది….ఈ అద్భుతమైన వాక్యంతో ప్రారంభమైన కవిత అక్షర సత్యాలు తో నిండి వుంది…సందర్భానుసారం చక్కని కవిత అందించిన శ్యామల గారికి అభినందనలు.

Reply

Leave a Comment