31.2 C
Hyderabad
April 19, 2024 03: 11 AM
Slider కవి ప్రపంచం

మహిళ

#PVS Krishnakumari

ప్రకృతి ఆమే, సృష్టికర్త ఆమే

ఒక జీవికి ప్రాణం పోసి

తన గర్భంలోనే ఉమ్మనీటి

సాగరాన్ని సృష్టించి,

రక్షణ కవచాన్ని ఏర్పరచి

అన్నపానాదులు అందిస్తూ

నీకు భరోసా నేనే అనటం

మహిళలకు కాక మరెవ్వరికి సాధ్యం?

సన్నజాజి తీగ ఆమే,

అవసరమైనప్పుడు

పిడికిలి బిగించే

ఉక్కు మహిళ కూడా ఆమే

వెలకట్టలేని , అంతుచిక్కని

రత్నరాశుల నిలయమైన

సాగరగర్భం వంటిది ఆమె మనసు

సంసార రధసారధి ఆమే

గృహమనే నందనవనంలో

కల్పవృక్షం ఆమే

అలుపెరగని అవిశ్రాంత

కష్టజీవి ఆమే

తండ్రి బిడ్డల మధ్య వారధి ఆమే

నాగరిక ప్రపంచానికి

చిహ్నం ఆమే

శతరూపాల సహస్రభావల

సమ్మేళనం

” మహిళ”

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

ట్రిబ్యూట్: మరణం లేని మహా శక్తి అంబేడ్కర్

Satyam NEWS

స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా మున్సిపల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తాం

Satyam NEWS

గురుదేవోభవ

Satyam NEWS

Leave a Comment