32.7 C
Hyderabad
March 29, 2024 11: 21 AM
Slider కవి ప్రపంచం

శ్రమ జీవన వేదం

#Alla Nageswararao Tenali

మట్టివాసనను మణిహారంగా

చెమట చుక్కను అమృతతుల్యంగా

శ్రమయేవ జయతే నినాదంగా

సూర్యచంద్రుల సాక్షిగా

నిరంతరం శ్రమించే శ్రమజీవులు

కాయకష్టం చేసే కార్మికులు!

పుడమితల్లి వడిలో  పడ్తున్న కష్టాన్ని మరచేందుకు

జనపదాలను ఆలపించే కూలీలూ

పరిశ్రమల్లో పరిశ్రమించే కార్మికులూ

రక్తాన్ని ఇంధనంగా మార్చి కష్టించే రిక్షా కార్మికులూ

బ్రతుకుకు భద్రతలేని బొగ్గు గని కార్మికులూ

రుధిరాన్ని స్వేదంగా మార్చి

పారిశ్రామిక ప్రగతికి పునాదులై నిలిచి

దేశాన్ని ప్రగతిపధంలో పయనింప చేసే చోదకులు కార్మికులు!

పండుగనక, పబ్బమనక

అనునిత్యం శ్రమిస్తూ

హక్కులకై పోరాడక

బాధ్యతలను నెరవేర్చే శ్రమజీవులు శ్రామికులు!

శ్రామికుల శ్రమ సౌందర్యం

దేశ ఆర్ధిక వికాసానికి మూలం

శ్రమయే వారి జీవన వేదం!

శ్రామికులే దేశ ప్రగతిపధ రధ చక్రాలు

వారి అభ్యున్నతే ప్రపంచ ప్రగతికి రాచమార్గాలు!

ఆళ్ల నాగేశ్వరరావు, తెనాలి, చరవాణి :7416638823

Related posts

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

బలమైన దేశం కోసమే పని చేస్తున్న బీజేపీ

Satyam NEWS

తిరుపతి పార్లమెంటు ఎన్నికలపై టీడీపీ విసృతస్థాయి సమావేశం

Satyam NEWS

Leave a Comment