28.7 C
Hyderabad
April 25, 2024 04: 02 AM
Slider సంపాదకీయం

సత్యం న్యూస్ ముందే చెప్పింది: వీఆర్వో వ్యవస్థ రద్దు

Satyamnews07

వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు.

సాయంత్రం 3 గంటల కల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని..5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశించారు. రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రక్షాణళ చేయబోతున్నారని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల కన్నా ముందుగా సత్యం న్యూస్ వెల్లడించిన విషయం పాఠకులకు తెలుసు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని రెవెన్యూ శాఖలో అదనంగా ఉన్న 20 వేల మందిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని కూడా సత్యం న్యూస్ తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొన్నది. సత్యం న్యూస్ రిపోర్టు చేసిన తర్వాత అన్ని మీడియాలు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సంబంధించిన వార్తలు ఇవ్వడం మొదలు పెట్టాయి.

రెవెన్యూ వ్యవస్థ  పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని కేసీఆర్ భావిస్తున్నట్లు కూడా సత్యం న్యూస్ తెలిపింది.

రికార్డుల్లో పేర్లు చేర్చాలంటే డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని, రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన పివి నరసింహారావు అప్పటిలో భూ సంస్కరణలు తీసుకువచ్చిన విధంగానే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పని చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కూడా సత్యం న్యూస్ వెల్లడించింది.

ఇప్పుడు తొలగిస్తున్న వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేస్తున్నారు.

Related posts

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

Satyam NEWS

ప్రతి రోజూ 20 నిమిషాలు ఎండలో కూర్చోండి

Satyam NEWS

Leave a Comment